News August 16, 2025

HYD: కోకాపేట్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

image

HYD కోకాపేట్ పరిధిలోని పోలువామి 90 విలాస్ ముందు ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రోడ్డు దాటుతున్న సమయంలో టాండాల మంజుల(44) అనే మహిళను దత్తుచంద్ర అనే వ్యక్తి బుల్లెట్ బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. మంజుల గాంట్లకుంట పరిధి కన్వాయిగూడెం తండాకు చెందిన మహిళ అనే నార్సింగి పోలీసులు తెలిపారు.

Similar News

News August 16, 2025

కురుపాం: ఆంగార కాయలకు భలే గిరాకీ..!

image

కురుపాం ఏజెన్సీ ప్రాంతంలోని ముఠా గ్రామాల్లో వర్షాకాలంలో పండే ఆంగార కాయలకు మంచి గిరాకీ ఉంది. ఏడాదికి ఒక సారి పండే అంగార కాయలు నాణ్యత, పరిమాణం బట్టి కిలో ధర రూ.160 నుంచి 210 పలుకుతోందని గిరిజనలు తెలిపారు. ఆంగాక కాయల కూరలతో కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయని గిరిజనుల నమ్మకం. వీటిని దళారులు కొండపై గ్రామాలకు వెళ్లి అక్కడ తక్కువ ధరకు కొని మైదాన ప్రాంతంలో అధిక ధరలకు అమ్ముతున్నారని వారు వాపోయారు.

News August 16, 2025

ఈ ఏడాది 13,260 మందిపై కేసులు: VZM SP

image

ఈ ఏడాది ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 13,260 మందిపై కేసులు నమోదు చేశామని SP వకుల్ జిందల్ శనివారం తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని, దొరికిన వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. వివిధ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెడుతున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.

News August 16, 2025

అమరావతి ఐకానిక్ టవర్ల పునాదుల్లో నీరు చేరటానికి కారణమిదే!

image

అమరావతి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఐకానిక్ టవర్ల పునాదులు 1, 2లో భారీగా నీరు చేరింది. రాయపూడి నుంచి వస్తున్న పాలవాగు బ్రాంచ్ కెనాల్ నీరు దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. వరద నీరు నిలవకుండా మూడు రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. వర్షాకాలానికి అనుగుణంగా పనులు చేపట్టినందున ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు.