News August 16, 2025
నెల్లూరు: AMC పదవులకు రిజర్వేషన్లు ఇలా..!

నెల్లూరులో పలు వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవులకు కలెక్టర్ ఆనంద్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు రూరల్/అర్బన్ ఓసీ మహిళకు, కోవూరు ఎస్టీ జనరల్, కావలి ఓసీ మహిళకు ఖరారైంది. ఆత్మకూరు ఓసీ జనరల్, ఉదయగిరి బీసీ జనరల్, సర్వేపల్లి ఓసీ జనరల్, రాపూరు బీసీ మహిళ, కందుకూరు ఎస్సీ మహిళకు అవకాశం దక్కింది. త్వరలోనే ఛైర్మన్ల పేరు వెల్లడించనున్నారు.
Similar News
News August 16, 2025
నెల్లూరులో ఇద్దరు యువకుల మృతి

నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. గూడూరు మండలం చెన్నూరుకు చెందిన ఆర్షద్(19), పోలయ్య(24) పినాకిని రైల్లో విజయవాడకు శనివారం బయల్దేరారు. మధ్యలో ఇద్దరూ డోర్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. నెల్లూరు, వేదాయపాలెం రైల్వే స్టేషన్ల మధ్య కొండాయపాలెం గేట్ వద్ద ఇద్దరూ జారి కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News August 16, 2025
గౌరవరంలో తేలుకుట్టి బాలుడి మృతి

కావలి మండలం గౌరవరానికి చెందిన చౌటూరి చిన్నయ్య కుమారుడు శ్రీనివాసులు (11) శనివారం తేలు కుట్టి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బాలుడు తమ ఇంటి వెనుక ఉన్న తాటి చెట్టుఎక్కి తాటిపండు కోస్తుండగా తేలు కుట్టింది. అతన్ని కావలి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి, మెరుగైన వైద్యం కోసం నెల్లూరు రెఫర్ చేశారు. బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటపై రూరల్ పోలీస్‌లు కేసు నమోదు చేశారు.
News August 16, 2025
పెంచలకోనలో స్మగ్లర్ అరెస్ట్

రాపూరు మండలం పెంచలకోన వద్ద నాలుగు ఎర్రచందనం దుంగలు, ఒక స్మగ్లర్‌ను తిరుపతి టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పెంచలకోన అటవీ ప్రాంతంలో కుంబింగ్ చేపడుతుండగా ఈదలచెరువు వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన నాలుగు ఎర్రచందనం దుంగలు, స్మగ్లర్‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్‌ను తిరుపతి టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.