News August 16, 2025
ADB: GREAT.. బడి కోసం రూ.60 లక్షల భూదానం

భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల క్రీడా స్థలం కోసం గ్రామానికి చెందిన పన్నాల భూమారెడ్డి, సంజీవరెడ్డి దాదాపు రూ.60 లక్షల విలువైన 1.5 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు గ్రామ పెద్దలు వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛందంగా దాతలు ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
Similar News
News August 17, 2025
మనకు, చైనాకు తేడా ఇదే!

ఏదైనా వస్తువును విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఇండియాలో సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయని పలువురు వ్యాపారవేత్తలు చెబుతున్నారు. చైనాలో ఒక కంటైనర్ ఫ్యాక్టరీ నుంచి పోర్టుకు వెళ్లాలంటే ఇన్వాయిస్, ప్యాకేజీ లిస్ట్ ఉంటే చాలంటున్నారు. అదే మన దేశంలో ట్యాక్స్ ఇన్వాయిస్, కమర్షియల్ ఇన్వాయిస్, ఈ-వే బిల్లు, ఇన్సూరెన్స్ పేపర్లు.. ఇలా 17-18 డాక్యుమెంట్లు అవసరం అని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో టైమ్ వృథా అవుతోందంటున్నారు.
News August 17, 2025
తాంసి: ఒకరికి తీవ్ర గాయాలు ఆవు మృతి

తాంసి మండలం పొన్నారి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఆవు ఇద్దరు మహిళలను పొడవడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఆవు దాడికి ఆగ్రహించిన అదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కత్తితో ఆవుపై దాడి చేయడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది.
News August 17, 2025
NZB: ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

NZB నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందారు. దీంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టాయి. ఆర్మూర్‌కు చెందిన సాయికుమార్(26) రోడ్డు ప్రమాదంలో గాయపడగా చేతికి కాలుకు గాయమైందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చేర్చుకుని ట్రీట్మెంట్ ప్రారంభించాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం చేస్తుండగా సాయికుమార్ మరణించాడని తెలపడంతో బంధువులు ఆందోళన చేపట్టారు.