News August 16, 2025
జనగామ: జాతీయ స్థాయి క్రీడాకారిణికి ప్రశంసా పత్రం!

జాతీయ స్థాయి క్రీడల్లో గెలుపొందుతూ జనగామ జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న క్రీడాకారిణి కృష్ణవేణి ప్రశంసా పత్రం అందుకుంది. జనగామలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో శుక్రవారం అందించారు. స్టే.ఘ. మండలం విశ్వనాధపురానికి చెందిన కృష్ణవేణి జాతీయ క్రీడల్లో విజయం సాధిస్తూ జిల్లాకు గుర్తింపు తీసుకొస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ ప్రశంసా పత్రం అందించారు.
Similar News
News August 16, 2025
NZB: సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వండి: కలెక్టర్

NZB కలెక్టరేట్‌లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తనిఖీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచరం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే కలెక్టరేట్‌లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462 220183కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
News August 16, 2025
కాళ్ల: లచ్చన్న జయంతి వేడుకలు

కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు.
News August 16, 2025
రేపు ఈసీ ప్రెస్ మీట్.. రీజన్ అదేనా?

భారత ఎన్నికల సంఘం రేపు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ‘ఓట్ చోరీ’ అంటూ పలుమార్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఈ కారణంగానే పలు చోట్ల కాంగ్రెస్ నేతలు ఓడారని ఆయన ఆరోపించారు.