News April 1, 2024
పోడు వివాదం.. 19 మంది మహిళలు రిమాండ్

సత్తుపల్లి మండలం బుగ్గపాడు సమీపంలోని చంద్రాయపాలెం పోడు వివాదంలో సీఐ టి.కిరణ్, పోలీసులపై దాడి ఘటనలో 19 మంది మహిళలను అరెస్ట్ చేసి ఆదివారం రాత్రి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, మరికొందరు పరారీలో ఉండగా గాలిస్తున్నట్లు చెప్పారు. వివాదంలో ముఖ్య భూమిక పోషించిన మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్ర కోసం గాలింపు ముమ్మరం చేశామని ఏసీపీ రఘు తెలిపారు. వీరి కోసం పలువురి ఇళ్లలోనూ సోదా చేశారు.
Similar News
News January 22, 2026
ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

ఓటీపీఎస్ (ఆన్‌లైన్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్) ద్వారా ఇసుకను పూర్తి పారదర్శకంగా సరఫరా చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, యాప్ లాంచ్ తర్వాత మాన్యువల్ పంపిణీ నిలిపివేయాలని ఆదేశించారు. ముందుగా ఇందిరమ్మ ఇళ్లకు, గృహ అవసరాలకు ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
News January 22, 2026
ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ‘నిఘా’ వైఫల్యం

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత గాలిలో దీపమైంది. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో మెడికల్ కౌన్సిల్ నిబంధనల కోసం పెట్టిన 12 మినహా, మిగిలినవన్నీ మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. నిర్వహణ లోపంతో కీలక నేరాలు జరిగినప్పుడు ఫుటేజీ లభించక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు వెచ్చిస్తున్నా పర్యవేక్షణ కరువైందని రోగులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.
News January 22, 2026
ఖమ్మం: మున్సిపల్ పోరు.. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..!

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఆశావహులు భారీగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారింది. కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో సర్వేల ఆధారంగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. అటు బీఆర్ఎస్ సైతం సర్వేలతో పాటు వార్డుల్లో పట్టున్న నేతల కోసం కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.


