News April 1, 2024

హైదరాబాద్ @ 38.2 డిగ్రీలు నమోదు

image

హైదరాబాద్, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.3 డిగ్రీలు, గాలిలో తేమ 24 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంలో రాగల రెండు, మూడు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News September 9, 2025

HYD: ఇది మరో ‘రాజావారి చేపల చెరువు’

image

రాజావారి చేపల చెరువు మూవీ మెసేజ్‌ను తలపించిందీ ఘటన. ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్‌తో SBI బ్యాంకు నుంచి రూ.6 కోట్లు తీసుకున్న నిందితులు ఎట్టకేలకు బుక్కయ్యారు. నెక్నాంపూర్‌లో లేని ల్యాండ్ ఉందని ఫేక్ డాక్యుమెంట్స్‌ సిద్ధం చేసి నగదు తీసుకున్నట్లు తేల్చిన సైబరాబాద్ EOW అధికారులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన నిందితులు చాటెడ్ అకౌంటెంట్ నారాయణ, రవి అరెస్ట్ అయ్యారు.

News September 9, 2025

HYD: వాటర్ వృథా చేస్తే కాల్ చేయండి!

image

గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జలమండలి విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. జూబ్లీహిల్స్, మంగళ్‌హాట్‌లో ఇప్పటికే తనిఖీలు పూర్తయ్యాయి. తాగునీటిని బైకులు, కార్లు కడగడం, ఫ్లోర్ క్లీనింగ్, ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. మంచినీటిని ఎవరైనా వృథా చేస్తే, 155313 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

News September 9, 2025

HYD: స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది

image

పోకిరీల ఆట కట్టించేందుకు వెస్ట్ జోన్‌లోని షేక్‌పేట్, ఖైరతాబాద్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది. రాత్రివేళల్లో అతివేగంతో వాహనాలు నడిపేవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వెయ్యికిపైగా కేసులు నమోదు చేశారు. వాహనాన్ని సీజ్ చేసి, చలాన్ కట్టిన తర్వాతే తిరిగి అప్పగిస్తున్నారు. ఈ డ్రైవ్‌ను 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 నెలలుగా నిర్వహిస్తున్నారు.