News August 16, 2025
కృష్ణా: కొంప ముంచుతున్న క్లౌడ్ బరస్టులు.. జిల్లాలో ఇలా!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కారణం క్లౌడ్‌బరస్ట్ అని అధికారులు చెబుతున్నారు. గతంలో 15-18 గంటల్లో కురిసే 100 మిల్లీమీటర్ల వర్షపాతం, ప్రస్తుతం కేవలం మూడు-నాలుగు గంటల్లోనే కురుస్తుండటంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు, పంటపొలాలు నీట మునుగుతున్నాయి. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలో సరాసరి 50-100 మి.మీ. వరకు వర్షం కురిసింది. ఈ అసాధారణ వాతావరణ మార్పుపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Similar News
News August 17, 2025
మద్యం తాగి వాహన నడిపి చిక్కుల్లో పడొద్దు: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 324 కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 మంది వాహనదారులకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మిగతా 308 కేసుల్లో రూ.3.95 లక్షల జరిమానాను వాహనదారులు కోర్టులో చెల్లించినట్లు సీపీ తెలిపారు.
News August 17, 2025
గంగారాం: రోడ్డు మీద కూర్చొని భోజనం చేసిన SI

రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గంగారం మండల కేంద్ర సమీపాన కొత్తగూడ వెళ్లే రహదారిపై వర్షపు నీటితో పెద్దఎత్తున గుంతలుపడ్డాయి. సమాచారం అందుకున్న ఎస్సై రవికుమార్ అక్కడికి చేరుకున్నారు. ఆ గుంతలు లేకుండా సరిచేశారు. అనంతరం తమతో పనిలో సహాయం చేసిన మిత్రులతో కలిసి రోడ్డుపై భోజనం చేశారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను ఎస్సై నెమరవేసుకున్నారు.
News August 17, 2025
US టీమ్ భారత పర్యటన రద్దు?

భారత్-అమెరికా మధ్య ఆరో విడత వాణిజ్య చర్చలను కొనసాగించేందుకు ఈ నెల 25న యూఎస్ బృందం ఢిల్లీ రావాల్సి ఉంది. కానీ యూఎస్ ప్రతినిధుల టూర్ రద్దైనట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతల్లో చర్చలు కొనసాగాయి. చివరి రౌండ్ చర్చలు వాషింగ్టన్‌లో భారత చీఫ్ నెగోషియేటర్ రాజేశ్ అగర్వాల్, యూఎస్ ప్రతినిధి బ్రెండన్ లించ్ మధ్య జరిగాయి.