News August 16, 2025

చింతలపూడి: తమ్మిలేరు ప్రాజెక్టుకు భారీగా వరద

image

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 3,400 క్యూసెక్కులు చేరుకోగా, నీటి మట్టం 344 అడుగులకు చేరింది. దీంతో చింతలపూడి మండలంలోని మూడు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Similar News

News August 17, 2025

గంగారాం: రోడ్డు మీద కూర్చొని భోజనం చేసిన SI

image

రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గంగారం మండల కేంద్ర సమీపాన కొత్తగూడ వెళ్లే రహదారిపై వర్షపు నీటితో పెద్దఎత్తున గుంతలుపడ్డాయి. సమాచారం అందుకున్న ఎస్సై రవికుమార్ అక్కడికి చేరుకున్నారు. ఆ గుంతలు లేకుండా సరిచేశారు. అనంతరం తమతో పనిలో సహాయం చేసిన మిత్రులతో కలిసి రోడ్డుపై భోజనం చేశారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను ఎస్సై నెమరవేసుకున్నారు.

News August 17, 2025

US టీమ్ భారత పర్యటన రద్దు?

image

భారత్-అమెరికా మధ్య ఆరో విడత వాణిజ్య చర్చలను కొనసాగించేందుకు ఈ నెల 25న యూఎస్ బృందం ఢిల్లీ రావాల్సి ఉంది. కానీ యూఎస్ ప్రతినిధుల టూర్ రద్దైనట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతల్లో చర్చలు కొనసాగాయి. చివరి రౌండ్ చర్చలు వాషింగ్టన్‌లో భారత చీఫ్ నెగోషియేటర్ రాజేశ్ అగర్వాల్, యూఎస్ ప్రతినిధి బ్రెండన్ లించ్‌ మధ్య జరిగాయి.

News August 17, 2025

KMR: జాతీయ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ బాలు

image

కామారెడ్డికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం దేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వ్యక్తిగతంగా 77 సార్లు రక్తదానం చేసినందుకు ఐవీఎఫ్ జాతీయ పురస్కారాన్ని ఈ నెల 19న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చేతుల మీదుగా న్యూఢిల్లీలో అందుకోనున్నట్లు ఆయన చెప్పారు.