News August 16, 2025
కృష్ణా: నీట మునిగిన పంటలు.. నష్ట పరిహారం ఇస్తారా..?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 6-7 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో పులిపాక-అవనిగడ్డ మార్గంలో అరటి, బొప్పాయి, పసుపు, కూరగాయల పంటలు, ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, చందర్లపాడు ప్రాంతాల్లో వరి, పత్తి పైరు కొంతమేర దెబ్బతిన్నాయి. ప్రస్తుతం నీరు బయటకు పోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పంట నష్టంపై ప్రభుత్వ సాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు
Similar News
News August 16, 2025
కరీంనగర్: ఆగిన స్మార్ట్ సిటీ అభివృద్ధి..!

కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి బ్రేక్ పడింది. CONG ప్రభుత్వమొచ్చి 20నెలలైనా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. జిల్లా, ఇన్ఛార్జ్ మంత్రులు వచ్చిన సమయంలో హడావిడి చేస్తున్నారే తప్ప డెవలప్మెంట్ ఫండ్స్ మాత్రం రావట్లేదు. అధికార పార్టీ నుంచి స్థానికంగా చెప్పుకోదగ్గ నేతల ప్రాతినిథ్యం లేకపోవడంతో KNR అభివృద్ధి కుంటుపడుతోంది. తమ హయాంలో వందల కోట్లు మంజూరై అభివృద్ధి జరిగిందని BRS నేతలంటున్నారు.
News August 16, 2025
బాపట్ల: రైలులో అధికారుల తనిఖీలు

మాదకద్రవ్యాలు అరికట్టడానికి ఈగల్ టీం రంగంలోకి దిగింది. బాపట్ల రైల్వే స్టేషన్‌లో నిలిచిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. బాపట్ల నుంచి ఒంగోలు వరకు చెకింగ్ కొనసాగించారు. ఎస్బీ ఎస్ఐ శ్రీనివాసరావు, చీరాల 1టౌన్ ఎస్ఐ హరి బాబు, చీరాల జీఆర్పీ ఎస్ఐ కొండయ్య తనిఖీల్లో పాల్గొన్నారు. డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా తనిఖీలు చేసినట్లు చెప్పారు.
News August 16, 2025
NGKL: జటాయువు పేరు మీద పుట్టిన జటప్రోలు

కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలులో ఉన్న మదనగోపాలస్వామి ఆలయం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలోని గాలిగోపురం, శిల్పకళా నైపుణ్యాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. 450 ఏళ్ల చరిత్ర ఉన్న జటప్రోలు-కొల్లాపూర్ సంస్థానాల నిర్మాణ శైలికి నిలువుటద్దం. జటాయువు పేరుమీద జటాయుపురమై, తర్వాత జటప్రోలు అన్న పేరు ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి.