News August 16, 2025

జనగామ జిల్లాలోని స్వాతంత్ర్య సమరయోధులు వీరే..!

image

స్వాతంత్ర్య సంగ్రామంలో జనగామ ప్రాంతం నుంచి పోరాటం చేసి తమ ప్రాణాలను సైతం అర్పించారు. వారు వివరాలు ఎస్.వీరయ్య(నిడిగొండ), సతరాసి నర్సయ్య(రఘునాథపల్లి), కంచనపల్లి నుంచి పాముకుంట్ల ఆయిలయ్య, కె.కృష్ణాజి, ముత్తిడి బుచ్చిరెడ్డి(జనగామ), కోరింగుల నారాయణరెడ్డి(గానుగపహాడ్), కె.జగన్నాథ్ రెడ్డి(గూడూరు), కళ్లెం నుంచి ఏలే వీరయ్య, ఏలే నారాయణలతో పాటు ఇతర గ్రామాల నుంచి రాగి నర్సింలు, జి.మోహన్ రెడ్డి ఉన్నారు.

Similar News

News August 17, 2025

మెదడు చురుగ్గా పని చేసేందుకు సింపుల్ ట్రిక్

image

కొన్ని రకాల పనులకు మీరు రెగ్యులర్‌గా వాడే చేయికి బదులు అప్పుడప్పుడు మరో చేతిని వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తినడం, వంట చేయడం, పళ్లు తోమడం, ఫోన్ వాడటం, తల దువ్వడం, షార్ట్ నోట్ రాయడం లాంటివి చేయాలని చెబుతున్నారు. ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్ వల్ల మెదడు యాక్టివ్, స్ట్రాంగ్ అవుతుందని తెలిపారు. అలాగే కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ మెరుగై మెదడు చురుగ్గా పని చేస్తుందని వివరించారు. మీరూ ట్రై చేయండి.
SHARE IT

News August 17, 2025

జ్యోతి మల్హోత్రాపై 2,500 పేజీల ఛార్జిషీట్

image

పాక్ స్పై, హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై సిట్ 2,500 పేజీల ఛార్జ్‌షీట్‌ను హిస్సార్ కోర్టుకు సమర్పించింది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. ఆమెకు ఐఎస్ఐ ఏజెంట్లు షాకిర్, హసన్ అలీ, నాసిర్ థిల్లన్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్‌ను కూడా జ్యోతి కలిసినట్లు తెలిపారు.

News August 17, 2025

మద్యం తాగి వాహన నడిపి చిక్కుల్లో పడొద్దు: వరంగల్ సీపీ

image

వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వారం రోజుల్లో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా జరిపిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మొత్తం 324 కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 మంది వాహనదారులకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మిగతా 308 కేసుల్లో రూ.3.95 లక్షల జరిమానాను వాహనదారులు కోర్టులో చెల్లించినట్లు సీపీ తెలిపారు.