News August 16, 2025

HYD: 9 నుంచి డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షలు

image

వచ్చే నెల 9 నుంచి డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. 2000 సంవత్సరం నుంచి 2015 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలో వివిధ డిగ్రీ కోర్సుల్లో చదివి ఫెయిల్ అయిన విద్యార్థులు వన్ టైం ఛాన్స్ పరీక్షకు అర్హులన్నారు. ఓయూ క్యాంపస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో వన్ టైం ఛాన్స్ పరీక్షకు ఫీజులు చెల్లించవచ్చని కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు.

Similar News

News August 16, 2025

HYD: అదుపుతప్పిన వాహనం.. కిందపడిపోయిన విగ్రహం

image

ఆరాంఘర్‌ శివారు మార్గంలో శనివారం రోడ్డుపై గణేశ్ విగ్రహం పడిపోయింది. వాహనం అదుపుతప్పి విగ్రహం ఒకేవైపు ఒరిగి, కిందపడిపోయినట్లు వాహనదారులు తెలిపారు. రోడ్డుకు అడ్డుగా భారీ ప్రతిమ పడిపోవడంతో ఆ రూట్‌లో ట్రాఫిక్ జామైంది. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. మండపానికి తీసుకెళ్తుంటే ఊహించని సంఘటన ఎదురైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

News August 16, 2025

అబిడ్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

image

నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామైంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అబిడ్స్ ఇస్కాన్‌ టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు. ఈ ప్రభావంతో అబిడ్స్, జగదీశ్ మార్కెట్, మొజంజాహీ మార్కెట్, కోఠి రూట్‌లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
SHARE IT

News August 16, 2025

జూబ్లీహిల్స్‌‌లో బూత్ స్థాయిలో పటిష్టం కావాలి: తుమ్మల

image

జూబ్లీహిల్స్‌లో కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పనిచేస్తూ బూత్ స్థాయిలో పటిష్టం కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ మధురానగర్, యాదగిరినగర్ 105 నుంచి 114 బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. బూత్ స్థాయిలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని, ఎన్నికల నాటికి పటిష్టం కావాలని తుమ్మల సూచించారు.