News August 16, 2025
ఖమ్మం: ఆ ప్రాంత ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

చింతకాని మండలం నాగులవంచ ప్రాంత ప్రజలకు రైల్వే శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నాగులవంచ రైల్వే స్టేషన్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రైల్వే స్టేషన్ మూసివేతను నిరసిస్తూ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడంతో పునరాలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News August 16, 2025
PDPL: చిల్లపల్లి జీపీకి జాతీయ గుర్తింపు

మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో 2024 నేషనల్ పంచాయతీ అవార్డు అందుకున్న మంథని(M) చిల్లపల్లి(GP)కి మరో గౌరవం దక్కింది. కార్యదర్శి R.రామ్ కిశోర్‌కు స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఎర్రకోటకు కేంద్రప్రభుత్వం ఆహ్వానం పంపింది. నిన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కిశోర్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. జెండా ఆవిష్కరణ ప్రత్యక్ష వీక్షణ గర్వకారణమని, గ్రామ అభివృద్ధికి కృషి కొనసాగిస్తానని ఆయన అన్నారు.
News August 16, 2025
‘మార్వాడీ గో బ్యాక్’ అంటూ ఆందోళన.. మీ కామెంట్?

TG: <<17419574>>మార్వాడీలు<<>> వ్యాపారం చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు వేగంగా విస్తరిస్తూ తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అని నినదిస్తున్నారు. అయితే దేశంలో ఎక్కడైనా నివసించే, వ్యాపారం చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు. క్వాలిటీతో పాటు మంచి సర్వీస్ అందిస్తే ఎవరికైనా లాభాలు వస్తాయంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News August 16, 2025
నెల్లూరులో ఇద్దరు యువకుల మృతి

నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. గూడూరు మండలం చెన్నూరుకు చెందిన ఆర్షద్(19), పోలయ్య(24) పినాకిని రైల్లో విజయవాడకు శనివారం బయల్దేరారు. మధ్యలో ఇద్దరూ డోర్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. నెల్లూరు, వేదాయపాలెం రైల్వే స్టేషన్ల మధ్య కొండాయపాలెం గేట్ వద్ద ఇద్దరూ జారి కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.