News August 16, 2025
నేడు ఝార్ఖండ్‌కు సీఎం రేవంత్

TG: నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఝార్ఖండ్‌కు వెళ్లనున్నారు. మాజీ సీఎం శిబూ సోరెన్ 11వ రోజు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి అక్కడికి చేరుకుంటారు. శిబూ సోరెన్ కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలియజేస్తారు. సోరెన్ మరణం తర్వాత ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆరా తీయనున్నారు.
Similar News
News August 16, 2025
బ్రెవిస్‌కు ఎక్స్‌ట్రా పేమెంట్.. CSK క్లారిటీ

IPL-2025లో ఆడేందుకు <<17405212>>బ్రెవిస్‌కు<<>> ఎక్స్‌ట్రా పేమెంట్ ఇచ్చారన్న మాజీ క్రికెటర్ అశ్విన్ వ్యాఖ్యలపై CSK స్పందించింది. ‘టోర్నీ నియమాలకు లోబడే గాయపడిన గుర్జప్నీత్ సింగ్ స్థానంలో బ్రెవిస్‌ను తీసుకున్నాం. రూల్ ప్రకారం రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌కు ఇంజూర్డ్ ప్లేయర్‌కు ఇవ్వాల్సిన ఫీ కంటే ఎక్కువ ఇవ్వొద్దు. దాని ప్రకారమే వేలంలో గుర్జప్నీత్‌ను కొన్న ధరనే (₹2.2Cr) బ్రెవిస్‌కు చెల్లించాం’ అని స్పష్టం చేసింది.
News August 16, 2025
యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేలా చర్చలు: ట్రంప్

అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం విజయవంతంగా సాగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా ముగించే దిశగా చర్చలు సాగాయన్నారు. ఇదే విషయమై జెలెన్ స్కీ, ఈయూ నేతలు, నాటో జనరల్ సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. ఎల్లుండి జెలెన్‌స్కీ అమెరికాకు వస్తారని, అన్ని సక్రమంగా జరిగితే పుతిన్‌తో మరోసారి సమావేశం అవుతామన్నారు.
News August 16, 2025
పారదర్శకంగానే ఎలక్టోరల్ రోల్స్: ఈసీ

ఎలక్టోరల్ రోల్స్‌పై పలు పార్టీలు అనుమానాలు లేవనెత్తడంపై ECI ప్రకటన జారీ చేసింది. ఎలక్టోరల్ రోల్స్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని, వీటి ప్రిపరేషన్లో ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలు పాల్గొంటాయంది. తప్పులు గుర్తించేందుకు తగిన సమయం ఉంటుందని పేర్కొంది. సరైన సమయంలో సమస్యలు లేవనెత్తితే పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపింది. చట్ట ప్రకారం, పారదర్శకంగానే ఎలక్టోరల్ రోల్ సిద్ధం చేస్తామని స్పష్టం చేసింది.