News August 16, 2025

మెదక్: అత్యధికంగా శివంపేటలో 128 మిమీ వర్షం

image

మెదక్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా శివంపేటలో 128 మిమీలు, నర్సాపూర్లో 108.8, కాగజ్ మద్దూర్‌లో 98.8, పెద్ద శంకరంపేటలో 89, బోడగట్టు ఈఎస్ఎస్ 74.5, కాళ్లకల్ 68 మిమీలు, మిగతా చోట్ల ఇంతకన్నా తక్కువ వర్షపాతం నమోదయింది.

Similar News

News October 27, 2025

పాపన్నపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

పాపన్నపేట మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన యువకుడు తరుణ్ రెడ్డి (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి తరుణ్ రెడ్డి సంగారెడ్డి నుంచి జోగిపేట వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఫసల్వాది వద్ద జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తరుణ్ రెడ్డి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News October 26, 2025

‘TET నుంచి మినహాయింపు ఇవ్వాలి’

image

సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మెదక్ కేవల్ కిషన్ భవన్‌లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న 5 డిఏలను వెంటనే ప్రకటించాలని, పిఆర్సి 2023 జూలై నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పద్మారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

News October 26, 2025

మెదక్: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికి..?

image

మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. ఈనెల 27న మెదక్‌ పట్టణంలోని శ్రీవెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో డ్రా నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. మద్యం పాలసీ 2025-27కు జిల్లాలోని మొత్తం 49 మద్యం షాపులకు 1,420 దరఖాస్తులు రాగా రూ.42.60 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. లక్కీ డ్రాలో ఎవరికి దక్కుతుందో చూడాలి.