News August 16, 2025
HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. రామంతపూర్‌లో నివాసముండే ఓ వ్యక్తి టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న కుమారుడు కనిపించడం లేదంటూ PSలో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కమర్ అనే వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.
Similar News
News August 16, 2025
దురాశతో ఉన్నది పోగొట్టుకున్నారు.. KCRపై రేవంత్ సెటైర్

TG: దేశానికి నాయకత్వం వహించాలనే దురాశతో ఉన్నది పోగొట్టుకున్నారని సీఎం రేవంత్ BRS చీఫ్ KCRపై పరోక్షంగా సెటైర్లు వేశారు. తెలంగాణ పేరు, పేగు బంధం కూడా తెంచుకున్నారని తెలిపారు. ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా తెలంగాణను మారుస్తానని, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యంతో పేదల ఆత్మగౌరవాన్ని పెంచామని ఓ పుస్తకావిష్కరణ సభలో చెప్పారు.
News August 16, 2025
HYD: అదుపుతప్పిన వాహనం.. కిందపడిపోయిన విగ్రహం

ఆరాంఘర్ శివారు మార్గంలో శనివారం రోడ్డుపై గణేశ్ విగ్రహం పడిపోయింది. వాహనం అదుపుతప్పి విగ్రహం ఒకేవైపు ఒరిగి, కిందపడిపోయినట్లు వాహనదారులు తెలిపారు. రోడ్డుకు అడ్డుగా భారీ ప్రతిమ పడిపోవడంతో ఆ రూట్‌లో ట్రాఫిక్ జామైంది. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. మండపానికి తీసుకెళ్తుంటే ఊహించని సంఘటన ఎదురైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
News August 16, 2025
ప్రజలు సహకరించాలి: నిర్మల్ ఎస్పీ

నిర్మల్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని ఎస్పీ జానకీ షర్మిల విజ్ఞప్తి చేశారు. కడెం, స్వర్ణ ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గేట్లు తెరుస్తున్నారని తెలిపారు. పశువులకాపరులు, మత్స్యకారులు దిగువ ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. జలాశయాల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్పీ పేర్కొన్నారు.