News August 16, 2025
కాశీబుగ్గలో 20 కేజీల గంజాయి స్వాధీనం

ఒడిశాకు చెందిన నలుగురు గంజాయి అక్రమ రవాణాదారులను పలాస రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. మోహనా బ్లాక్ పడొవ గ్రామానికి చెందిన నాయక్, రాహిత్ బిర, జునైలు, గుమ్మా గ్రామానికి చెందిన సురుసింగ్ వద్ద 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకి పంపించామని అన్నారు.
Similar News
News August 16, 2025
మహిళా ఉద్యోగులకు ఎమ్మెల్యే కూన వేధింపులు: YCP

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ఉద్యోగులకు ఫోన్లు చేసి వేధిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ‘కేజీబీవీ ప్రిన్సిపల్‌కు కూడా ఆయన వేధింపులు తప్పడం లేదు. మహిళా ఉద్యోగులు లొంగకుంటే బదిలీ చేయిస్తానని బెదిరిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది. ఎమ్మెల్యే తన శాడిజం చూపుతున్నారని మండిపడింది.
News August 16, 2025
SKLM: ‘జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పని చేయండి’

జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి శుక్రవారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అభివృద్ధికి కృషి చేసిన రాజకీయ నాయకులు, స్వతంత్ర సమరయోధులు త్యాగాలు మరువలేని అన్నారు.
News August 15, 2025
స్వతంత్ర్య ఫలాలు అందరికీ అందాలి: మంత్రి అచ్చన్న

స్వతంత్ర్య ఫలాలు అందరికీ అందాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 79వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో త్రివర్ణ పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.