News August 16, 2025
HYD: డిప్లమా ఇన్ మ్యాజిక్.. దరఖాస్తుల ఆహ్వానం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లమా ఇన్ మ్యాజిక్ (ఇంద్రజాలం) కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత అయినవారు అర్హులని, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కోర్సును ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నాంపల్లి ప్రాంగణంలో నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు 90597 94553 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News August 16, 2025
HYD: అదుపుతప్పిన వాహనం.. కిందపడిపోయిన విగ్రహం

ఆరాంఘర్ శివారు మార్గంలో శనివారం రోడ్డుపై గణేశ్ విగ్రహం పడిపోయింది. వాహనం అదుపుతప్పి విగ్రహం ఒకేవైపు ఒరిగి, కిందపడిపోయినట్లు వాహనదారులు తెలిపారు. రోడ్డుకు అడ్డుగా భారీ ప్రతిమ పడిపోవడంతో ఆ రూట్‌లో ట్రాఫిక్ జామైంది. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. మండపానికి తీసుకెళ్తుంటే ఊహించని సంఘటన ఎదురైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
News August 16, 2025
అబిడ్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామైంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు. ఈ ప్రభావంతో అబిడ్స్, జగదీశ్ మార్కెట్, మొజంజాహీ మార్కెట్, కోఠి రూట్‌లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
SHARE IT
News August 16, 2025
జూబ్లీహిల్స్‌లో బూత్ స్థాయిలో పటిష్టం కావాలి: తుమ్మల

జూబ్లీహిల్స్‌లో కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పనిచేస్తూ బూత్ స్థాయిలో పటిష్టం కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ మధురానగర్, యాదగిరినగర్ 105 నుంచి 114 బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. బూత్ స్థాయిలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని, ఎన్నికల నాటికి పటిష్టం కావాలని తుమ్మల సూచించారు.