News August 16, 2025

కడెం ప్రాజెక్ట్ దిగువ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వర్షాలు అధికంగా కురిసి, ప్రాజెక్టు గేట్లను ఎత్తినందున.. కడెం ప్రాజెక్టు దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోకి పశువుల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల, స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News August 17, 2025

సరోగసి కేసు: మరిన్ని ఆసుపత్రులకు నోటీసులు

image

TG: <<17423890>>సరోగసి<<>> కేసులో నిందితురాలు లక్ష్మి పలు ఆసుపత్రులకు ఏజెంట్‌‌గా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో హెగ్డే, లక్స్ ఆసుపత్రి, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్, ఫర్టీ కేర్, అమూల్య ఫెర్టిలిటీ, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రత నేరం అంగీకరించిన సంగతి తెలిసిందే.

News August 17, 2025

మనకు, చైనాకు తేడా ఇదే!

image

ఏదైనా వస్తువును విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఇండియాలో సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయని పలువురు వ్యాపారవేత్తలు చెబుతున్నారు. చైనాలో ఒక కంటైనర్ ఫ్యాక్టరీ నుంచి పోర్టుకు వెళ్లాలంటే ఇన్వాయిస్, ప్యాకేజీ లిస్ట్ ఉంటే చాలంటున్నారు. అదే మన దేశంలో ట్యాక్స్ ఇన్వాయిస్, కమర్షియల్ ఇన్వాయిస్, ఈ-వే బిల్లు, ఇన్సూరెన్స్ పేపర్లు.. ఇలా 17-18 డాక్యుమెంట్లు అవసరం అని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో టైమ్ వృథా అవుతోందంటున్నారు.

News August 17, 2025

తాంసి: ఒకరికి తీవ్ర గాయాలు ఆవు మృతి

image

తాంసి మండలం పొన్నారి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఆవు ఇద్దరు మహిళలను పొడవడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఆవు దాడికి ఆగ్రహించిన అదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కత్తితో ఆవుపై దాడి చేయడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది.