News August 16, 2025
RED ALERT: అత్యంత భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News August 17, 2025
51 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమైన మలైకా?

రెండో పెళ్లిపై బాలీవుడ్ నటి మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను హార్డ్ కోర్ రొమాంటిక్‌ను. ప్రేమను ఎప్పటికీ నమ్ముతాను. మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకుంటా. నేటి యువత కూడా అన్నీ ఆలోచించి పెళ్లి చేసుకోండి. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. విడాకుల తర్వాత నన్ను అందరూ స్వార్థపరురాలు అంటూ నిందించారు. కానీ విడాకుల్లోనే నేను సంతోషం వెతుక్కున్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
News August 17, 2025
గోల్డ్ vs కార్.. ఏది కొంటే మంచిది?

మిడిల్ క్లాస్ కుటుంబాలు కారు కంటే బంగారం కొనడమే ఉత్తమమని అనలిస్టులు సూచిస్తున్నారు. కారు విలువ 10-12 ఏళ్లలో 70-80 శాతానికి పడిపోతుందని, అదే బంగారం విలువ పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు. ‘ఖరీదైన ఫోన్, ట్రిప్‌లు తాత్కాలిక ఆనందం ఇచ్చినా సంపదను పెంచవు. వెకేషన్ 5 రోజులే ఉంటుంది.. కానీ బంగారం 5 తరాలు నిలుస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినా బంగారం విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది’ అని పేర్కొంటున్నారు.
News August 17, 2025
నేటి నుంచి రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. ఇది ససరాం నుంచి ప్రారంభమై 16రోజుల పాటు 25 జిల్లాల మీదుగా సాగనుంది. ‘ఒక వ్యక్తి-ఒక ఓటు’ తమ విధానమని చెబుతున్న రాహుల్.. బిహార్‌లో SIRను వ్యతిరేకిస్తూ యాత్రకు సిద్ధమయ్యారు. 1,300KM మేర సాగే ఈ యాత్ర కొంతదూరం కాలినడకన, మరికొంత దూరం వాహనంపై హైబ్రిడ్ మోడల్‌లో సాగనుంది. మహాఘట్ బంధన్ నేతలు ఇందులో పాల్గొననున్నారు.