News August 16, 2025

గోవిందరావుపేట: 32 ఫీట్లకు చేరిన లక్నవరం సరస్సు

image

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు ఉద్ధృతంగా ప్రవర్తిస్తోంది. కాగా, 32 ఫీట్లకు నీటిమట్టం చేరిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సరస్సు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ సమయంలోనైనా మత్తడి పొంగే అవకాశం ఉందని, సరస్సులో మత్స్యకారులు, స్థానిక ప్రజలు దిగరాదన్నారు.

Similar News

News August 17, 2025

శుభ సమయం (17-08-2025) ఆదివారం

image

✒ తిథి: బహుళ నవమి రా.8.31 వరకు
✒ నక్షత్రం: కృత్తిక ఉ.6.45 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేవు
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13
✒ వర్జ్యం: రా.9.39-11.09 వరకు
✒ అమృత ఘడియలు: తె.2.07-3.36 వరకు

News August 17, 2025

ఈనెల 19న రాజంపేటకు YS జగన్

image

YS జగన్మోహన్ రెడ్డి ఈనెల 19న రాజంపేట మండలం ఆకేపాడు గ్రామానికి రానున్నారని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి తెలిపారు. YS జగన్ హెలికాప్టర్‌లో దిగడానికి ఆకేపాడు గ్రామం వద్ద జరుగుతున్న పనులను MLA శనివారం పరిశీలించారు. ఆకేపాటి తమ్ముడి కుమారుడి రిసెప్షన్‌లో పాల్గొనడానికి జగన్ రానున్నారని MLA తెలిపారు.

News August 17, 2025

యూరియా కొరతతో ప్రకాశం రైతుల అవస్థలు

image

ప్రకాశం జిల్లాలో పలుచోట్ల యూరియా అందుబాటులో లేదు. త్రిపురాంతకం మండల పరిధిలోని ప్రైవేటు ఎరువుల దుకాణాలతోపాటు గ్రోమోర్ సెంటర్లలో యూరియా అందుబాటులోలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమౌతున్న రైతులకు యూరియా లేకపోవడం సాగుకు ఇబ్బందిని కలిగిస్తుంది. బయట దుకాణాల్లో ఎక్కువ ధరకు యూరియా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నా అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు అవస్థ పడుతున్నారు.