News August 16, 2025
సంగారెడ్డి: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్‌గా వాతావరణ శాఖ ప్రకటించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని అన్నారు. ప్రజలు వాగులు, చెరువులు, కుంటల దగ్గరికి వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
Similar News
News August 17, 2025
NZB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంత మందికి వచ్చిందో తెలుసా?

నిజామాబాద్ జిల్లాలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఊతమిచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కళ్యాణ లక్ష్మి కింద 1,080 మంది లబ్ధిదారులకు రూ.10.81 కోట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా, షాదీ ముబారక్ ద్వారా 672 మంది లబ్ధిదారులకు రూ.6.72 కోట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం రూ.17.53 కోట్లు పంపిణీ అయినట్లు పేర్కొన్నారు.
News August 17, 2025
కృష్ణ: Way2News ఎఫెక్ట్.. స్పందించిన మంత్రి

కృష్ణ మండలం గుడెబల్లూర్‌లో శ్మశానానికి వెళ్లే దారిలేక గ్రామస్థులు మృతదేహాలను మోకాలి లోతు నీటిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 4న Way2Newsలో ‘మంత్రి ఇలాకాలో <<17296536>>శ్మశానానికి<<>> దారేది?’ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై తక్షణమే శ్మశానానికి రోడ్డు వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్లొకెయిన్‌తో పనులు మొదలుపెట్టారు. దీంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
News August 17, 2025
విజయవాడలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

విజయవాడలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ. 240గా విక్రయిస్తున్నారు. అదే విధంగా విత్ స్కిన్ కేజీ రూ.200 పలుకుతుంది. మటన్ కేజీ రూ. 850 ఉంది. విజయవాడ నగర వ్యాప్తంగా చికెన్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా నాన్‌వెజ్ ధరలు పెరుగుతున్నాయని మాంసాహార ప్రియులు అంటున్నారు.