News August 16, 2025
తాంసి: రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని తాంసి మండలం కప్పర్ల రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశాల్ శ్రీ రాముడిని కృష్ణుడి రూపంలో అలంకరించారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న రాముడి రూపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News August 17, 2025
ADB: సహాయక చర్యల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు

ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులకు వెంటనే సహాయం అందించేందుకు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌తో పాటు మున్సిపాలిటీ టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు తమ సమస్యలను కంట్రోల్ రూమ్ నంబర్: 18004251939, మున్సిపాలిటీ టోల్‌ఫ్రీ 9492164153కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం అందిన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.
News August 16, 2025
ADB: ప్రేమకు ప్రతిరూపం రాధాకృష్ణులు

కృష్ణుడి ప్రేమ, ఆధ్యాత్మికతకు ప్రతీక రాధ. రాధాకృష్ణుల ప్రేమ బంధాలకు అతీతమైనది. వారి అనుబంధం దైవిక ప్రేమ, నిస్వార్థ భక్తికి నిలువెత్తు నిదర్శనం. భీంపూర్(M)లో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం గుబిడిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో చిన్నారులు వేసిన శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకలు తిలకించేందుకు గ్రామస్థులు ఒకచోట చేరారు.
News August 16, 2025
ADB: రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలు ప్రారంభం

క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు విజేతనే అని తెలంగాణ రాష్ట్ర బేస్ బాల్ సంఘం అధ్యక్షుడు హరిశంకర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ బేస్ బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రం నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొనగా వారికి అవసరమైన పూర్తి సౌకర్యాలు కల్పించారు. జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.