News August 16, 2025
GET READY: 4.05 PMకి OG నుంచి అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ నుంచి మరో అప్డేట్ రానుంది. ఈ చిత్రంలోని ‘కన్మని’ సాంగ్‌ను ఈరోజు సాయత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రెడీగా ఉండాలంటూ ఫ్యాన్స్‌కు సూచించారు. ప్రియాంక మోహన్, పవన్ మధ్య ఈ సాంగ్ సాగుతుందని హింట్ ఇచ్చారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే.
Similar News
News August 17, 2025
పిల్లలను చంపి.. ఉరేసుకున్న తండ్రి

AP: పిల్లలను చంపేసి ఓ తండ్రి ఉరేసుకున్న ఘటన గుంటూరులోని సాయిబాబా కాలనీలో జరిగింది. నరసరావుపేటకు చెందిన యూసుబ్(28), సైదాబీ దంపతులు. భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం గమనించిన యూసుబ్ ఈ నెల 14న గొడవ పడి చేయి చేసుకోగా ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆపై పిల్లలు హుస్సేన్(6), ఆరిఫ్(5)లను తీసుకొని యూసుబ్ తన అక్క ఇంటికి వెళ్లాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి తాను ఉరేసుకున్నాడు.
News August 17, 2025
51 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమైన మలైకా?

రెండో పెళ్లిపై బాలీవుడ్ నటి మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను హార్డ్ కోర్ రొమాంటిక్‌ను. ప్రేమను ఎప్పటికీ నమ్ముతాను. మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకుంటా. నేటి యువత కూడా అన్నీ ఆలోచించి పెళ్లి చేసుకోండి. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. విడాకుల తర్వాత నన్ను అందరూ స్వార్థపరురాలు అంటూ నిందించారు. కానీ విడాకుల్లోనే నేను సంతోషం వెతుక్కున్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
News August 17, 2025
గోల్డ్ vs కార్.. ఏది కొంటే మంచిది?

మిడిల్ క్లాస్ కుటుంబాలు కారు కంటే బంగారం కొనడమే ఉత్తమమని అనలిస్టులు సూచిస్తున్నారు. కారు విలువ 10-12 ఏళ్లలో 70-80 శాతానికి పడిపోతుందని, అదే బంగారం విలువ పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు. ‘ఖరీదైన ఫోన్, ట్రిప్‌లు తాత్కాలిక ఆనందం ఇచ్చినా సంపదను పెంచవు. వెకేషన్ 5 రోజులే ఉంటుంది.. కానీ బంగారం 5 తరాలు నిలుస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినా బంగారం విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది’ అని పేర్కొంటున్నారు.