News April 1, 2024
ధోనీ కమిట్మెంట్ ఇలాగే ఉంటుంది

నిన్న ఢిల్లీతో మ్యాచులో ధోనీ బ్యాటింగ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన ఎడమకాలుకు పట్టీతో కనిపించారు. ఢిల్లీ ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ కనిపించారు. 42 ఏళ్ల వయసులోనూ ఆయనకు ఆట పట్ల ఉన్న కమిట్మెంట్ చూస్తుంటే గర్వంగా ఉందని.. యువ ఆటగాళ్లకు పర్ఫెక్ట్ రోల్ మోడల్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా మ్యాచ్ తర్వాత గ్రౌండ్ స్టాఫ్‌తో ధోనీ ఫొటో దిగడం గమనార్హం.
Similar News
News April 20, 2025
అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల

అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్(మ్యూజిషియన్స్) పోస్టులకు <
వెబ్‌సైట్:https://agnipathvayu.cdac.in/
News April 20, 2025
హసీనా అరెస్టుకు ఇంటర్‌పోల్ సాయం కోరిన బంగ్లా

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్‌పోల్‌ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్‌గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు మాజీ మంత్రులు, ఆర్మీ అధికారులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ ఇస్తే ఆ వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలవుతుంది. కాగా హసీనా గతేడాది AUG 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
News April 20, 2025
ధోనీ పరిస్థితులను తలకిందులు చేయగలడు: రోహిత్

ధోనీ సామర్థ్యం, అనుభవాన్ని రోహిత్ కొనియాడారు. ధోనీతో అంత ఈజీ కాదని చెప్పారు. ‘మహీ ఎన్నో మ్యాచులకు కెప్టెన్‌గా చేశారు. ఎన్నో ట్రోఫీస్ గెలిపించారు. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిగా ఉంటే మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం వారిపై ఆధిక్యంలో ఉన్నా.. ఒక సడెన్ మూవ్‌తో మనల్ని ప్రెజర్‌లోకి నెట్టగలడు. ధోనీ ఉంటే.. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.