News August 16, 2025
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండండి: మంత్రి కొండా

ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో జిల్లాలోని సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.
Similar News
News August 16, 2025
మహేశ్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ?

సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూతురు భారతి ఘట్టమనేని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
News August 16, 2025
తాండూరు: సర్కారుతో తేల్చుకుందాం: మందకృష్ణ మాదిగ

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్లు అమలు చేసుకునేందుకు సర్కారుతో తేల్చుకుందామని MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం తాండూరులో పింఛన్ల సన్నాహక సమావేశం నిర్వహించారు. పేదల కోసం ఆరోగ్య శ్రీపథకం అమలుతో పాటు రేషన్ కోటా, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్ అమలు పథకానికి ఎమ్మార్పీఎస్ పోరాటం చేసిందన్నారు. దాని ఫలితంగా ఆరోగ్య శ్రీసేవలు, ఫించన్లు, రేషన్ పొందుతున్నారన్నారు.
News August 16, 2025
సర్పంచ్ సాబ్‌లు వచ్చేదెప్పుడో.. బిల్లులు పడేదెప్పుడో?

TG: బిల్లులు పేరుకుపోవడంతో గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావొస్తోంది. కొత్త సర్పంచులు వచ్చాకే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు నిధులు విడుదల అవుతాయి. దీంతో కాంట్రాక్టర్లు గ్రామాలకు శానిటరీ, ఇతర సామగ్రి పంపిణీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే రూ.కోట్లలో బిల్లులు రావాల్సి ఉందంటున్నారు. అటు BC రిజర్వేషన్లతో ‘స్థానిక ఎన్నికలు’ ఆలస్యం అవుతున్నాయి.