News August 16, 2025
SBI హోం లోన్ వడ్డీ రేట్లు పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోం లోన్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పటివరకు గృహ రుణ రేట్లు 7.50% నుంచి 8.45%గా ఉండగా, తాజా నిర్ణయంతో 7.50% నుంచి 8.70 శాతానికి పెంచింది. ఆగస్టు 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చిందని ఎస్బీఐ తెలిపింది. ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి ఈ పెంచిన రేట్లు వర్తించవని, కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని తెలుస్తోంది.
Similar News
News August 17, 2025
జ్యోతి మల్హోత్రాపై 2,500 పేజీల ఛార్జిషీట్

పాక్ స్పై, హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై సిట్ 2,500 పేజీల ఛార్జ్‌షీట్‌ను హిస్సార్ కోర్టుకు సమర్పించింది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. ఆమెకు ఐఎస్ఐ ఏజెంట్లు షాకిర్, హసన్ అలీ, నాసిర్ థిల్లన్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్‌ను కూడా జ్యోతి కలిసినట్లు తెలిపారు.
News August 17, 2025
US టీమ్ భారత పర్యటన రద్దు?

భారత్-అమెరికా మధ్య ఆరో విడత వాణిజ్య చర్చలను కొనసాగించేందుకు ఈ నెల 25న యూఎస్ బృందం ఢిల్లీ రావాల్సి ఉంది. కానీ యూఎస్ ప్రతినిధుల టూర్ రద్దైనట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతల్లో చర్చలు కొనసాగాయి. చివరి రౌండ్ చర్చలు వాషింగ్టన్‌లో భారత చీఫ్ నెగోషియేటర్ రాజేశ్ అగర్వాల్, యూఎస్ ప్రతినిధి బ్రెండన్ లించ్ మధ్య జరిగాయి.
News August 17, 2025
ఆసియా కప్‌కు హర్భజన్ టీమ్ ఇదే

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ తన జట్టు అంచనాను ప్రకటించారు. ఈ జట్టులో అనూహ్యంగా రియాన్ పరాగ్‌కు చోటు ఇవ్వడం విశేషం. అలాగే సంజూ శాంసన్‌ను పక్కనబెట్టారు. జట్టు: జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిషేక్, గిల్, శ్రేయస్, సూర్య, పంత్, హార్దిక్, సుందర్, పరాగ్, కుల్దీప్, అక్షర్, బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్. దీనిపై మీ కామెంట్?