News August 16, 2025

కాళ్ల: లచ్చన్న జయంతి వేడుకలు

image

కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు.

Similar News

News August 17, 2025

పాలకొల్లు రానున్న మంత్రి లోకేశ్

image

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆదివారం పాలకొల్లు రానున్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ నిశ్చితార్థం వేడుకల్లో ఆయన పాల్గొనన్నారు. స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులో ఎస్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ఉదయం ఏడు గంటలకు జరిగే నిశ్చితార్థ వేడుకలో మంత్రి లోకేష్ పాల్గొంటారని మంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

News August 16, 2025

ఆకివీడు: కండక్టర్‌గా మారిన RRR

image

‘స్త్రీ శక్తి’ పథకాన్ని డిప్యూటీ స్పీకర్ RRR శుక్రవారం దుంపగడపలో ప్రారంభించారు. కండక్టర్‌గా మారి, కాసేపు మహిళలకు ఉచిత టికెట్లు ఇచ్చారు. ప్రభుత్వం మహిళాభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 297 బస్సులకు గాను 225 బస్సులు ఈ పథకంలో సేవలందిస్తున్నాయని, ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించిందని ఆయన వివరించారు.

News August 16, 2025

పాలకోడేరు: జెండాను ఆవిష్కరించిన ఎస్పీ

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు ఎస్పీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీస్ అధికారులు, సిబ్బంది, జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.