News August 16, 2025
అమరావతి ఐకానిక్ టవర్ల పునాదుల్లో నీరు చేరటానికి కారణమిదే!

అమరావతి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఐకానిక్ టవర్ల పునాదులు 1, 2లో భారీగా నీరు చేరింది. రాయపూడి నుంచి వస్తున్న పాలవాగు బ్రాంచ్ కెనాల్ నీరు దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. వరద నీరు నిలవకుండా మూడు రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. వర్షాకాలానికి అనుగుణంగా పనులు చేపట్టినందున ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News August 17, 2025
ఖమ్మం జిల్లాలో 24 గంటల్లో 15.6 మి.మీ. వర్షపాతం

ఖమ్మం జిల్లాలో గత 24 గంటల్లో 15.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. తల్లాడలో అత్యధికంగా 6.2 మి.మీ., నెలకొండపల్లిలో 3.6, సింగరేణిలో 2.6, వైరాలో 1.2, కామేపల్లిలో 1.0, ఎన్కూరులో 0.8 మి.మీ. వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని, జిల్లా సగటు వర్షపాతం 0.7 మి.మీ.గా ఉందని అధికారులు పేర్కొన్నారు
News August 17, 2025
జుక్కల్: బిందెలతో క్యూరింగ్.. ఐడియా అదుర్స్

సాధారణంగా పిల్లర్ల క్యూరింగ్ అంటే గుడ్డలు చుట్టి నీళ్లు కొట్టడం చూస్తుంటాం. కానీ, జుక్కల్ మండలం పెద్దగుల్లలో జరుగుతున్న ఒక నిర్మాణంలో అందుకు భిన్నంగా పిల్లర్లపై బిందెలు పెట్టారు. పిల్లర్ల పైన ఏర్పాటు చేసిన బిందెలకు చిన్న రంధ్రాలు చేసి, వాటిలో నీటిని నింపుతున్నారు. ఈ రంధ్రాల నుంచి నీరు బిందువుల రూపంలో కిందకి జారి, పిల్లర్లకు క్యూరింగ్ అవుతుంది. ఈ వినూత్న పద్ధతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
News August 17, 2025
భద్రాద్రి: పంచాయతీలను వేధిస్తోన్న నిధుల కొరత

సర్పంచుల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావొస్తుండటంతో గ్రామ పంచాయితీ బిల్లులు పేరుకుపోయాయి. దీంతో గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. కొత్త సర్పంచులు వచ్చాకే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు నిధులు రిలీజ్ అవుతాయి. దీంతో కాంట్రాక్టర్లు గ్రామాలకు శానిటరీ, ఇతర సామగ్రి పంపిణీ చేసేందుకు నో చెబుతున్నారు. ఇప్పటికే రూ.కోట్లలో బిల్లులు రావాల్సి ఉందంటున్నారు.