News August 16, 2025
మహిళా ఉద్యోగులకు ఎమ్మెల్యే కూన వేధింపులు: YCP

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ఉద్యోగులకు ఫోన్లు చేసి వేధిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ‘కేజీబీవీ ప్రిన్సిపల్‌కు కూడా ఆయన వేధింపులు తప్పడం లేదు. మహిళా ఉద్యోగులు లొంగకుంటే బదిలీ చేయిస్తానని బెదిరిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది. ఎమ్మెల్యే తన శాడిజం చూపుతున్నారని మండిపడింది.
Similar News
News February 16, 2026
ఇండియా పోస్ట్ లో ఉద్యోగాలకు నేడే లాస్ట్..!

శ్రీకాకుళం జిల్లాలో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల దరఖాస్తుకు నేటితో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18-40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఉండదు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380,
ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000-24,470 వేతనం ఉంటుంది.
News February 16, 2026
టెక్కలి: మూడేళ్ళ క్రితం తండ్రి మృతి… ఇప్పుడు కుమార్తె ఆత్మహత్య

టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందిన ఏ.అరుణ(19) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆదివారం <<19152656>>కాకినాడ JNTU హాస్టల్‌లో ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మృతురాలి తండ్రి రాము మూడేళ్ల క్రితం తిరుపతిలో భవన నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. తాజాగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతురాలికి తల్లి సంధ్య(వ్యవసాయ కూలీ), సోదరుడు ఉన్నారు.
News February 15, 2026
జేఎన్టీయూ హాస్టల్‌లో శ్రీకాకుళం విద్యార్థిని సూసైడ్

కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఏ.అరుణ(19) ఇవాళ సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సర్పవరం పోలీసులు తెలిపారు. జేఎన్టీయులోని నాగవల్లి లేడీస్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలిది శ్రీకాకుళం జిల్లా పాలసింగి గ్రామం అని చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసుపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


