News April 1, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,350 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు మిర్చి ధర రూ.200 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
Similar News
News March 15, 2026
ఖమ్మంలో వర్షాల హెచ్చరిక.. రైతులకు జాగ్రత్తలు

నేటి నుంచి 20 వరకు ఖమ్మం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారి నరసింహారావు తెలిపారు. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు సంభవించే పరిస్థితులు ఉన్నాయన్నారు. మార్చి 18, 19 తేదీల్లో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వెల్లడించారు. రైతులు పంటలను రక్షించుకునే చర్యలు తీసుకుని గాలులు, వడగళ్ల వానల వల్ల నష్టం కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
News March 15, 2026
ప్రయాణికులకు శుభవార్త.. ప్రతి 45 నిమిషాలకో ఏసీ బస్సు

వేసవి దృష్ట్యా ఖమ్మం నుంచి హైదరాబాద్, మియాపూర్‌కు ప్రతి 45 నిమిషాలకో ఏసీ రాజధాని నాన్‌స్టాప్ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. కొత్త బస్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ల కోసం tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
News March 14, 2026
గ్యాస్ బుకింగ్ పేరిట మోసాలు: సీపీ హెచ్చరిక

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం హెచ్చరించారు. నకిలీ లింకులు, ఎస్ఎంఎస్ల ద్వారా కేవైసీ, ఓటీపీ వివరాలు కోరుతూ నగదు కాజేస్తున్నారని తెలిపారు. గ్యాస్‌ను కేవలం అధికారిక యాప్‌ల ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. బాధితులు వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.


