News August 16, 2025

కంటి చూపును మెరుగుపరిచే ఫుడ్స్ ఇవే..

image

రోజంతా కంప్యూటర్ స్క్రీన్లు, ఫోన్లు చూడటం వల్ల చాలామందిని కంటి సమస్యలు వేధిస్తున్నాయి. అందుకే కంటి సంరక్షణకు మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్-A పుష్కలంగా ఉండే క్యారెట్‌ కంటి చూపును మెరుగుపరుస్తుంది. సాల్మన్ చేపల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కళ్లను పొడిబారకుండా చేస్తాయి. డ్రైఫ్రూట్స్ రోగ నిరోధకశక్తిని పెంచి కంటి సమస్యలను నివారిస్తాయి. పాలకూర, బచ్చలికూర చూపును మెరుగుపరుస్తాయి.

Similar News

News August 17, 2025

నేటి నుంచి రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. ఇది ససరాం నుంచి ప్రారంభమై 16రోజుల పాటు 25 జిల్లాల మీదుగా సాగనుంది. ‘ఒక వ్యక్తి-ఒక ఓటు’ తమ విధానమని చెబుతున్న రాహుల్.. బిహార్‌లో SIRను వ్యతిరేకిస్తూ యాత్రకు సిద్ధమయ్యారు. 1,300KM మేర సాగే ఈ యాత్ర కొంతదూరం కాలినడకన, మరికొంత దూరం వాహనంపై హైబ్రిడ్ మోడల్‌లో సాగనుంది. మహాఘట్ బంధన్ నేతలు ఇందులో పాల్గొననున్నారు.

News August 17, 2025

నేడే లాస్ట్.. IBలో 4,987 ఉద్యోగాలు

image

కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల <>దరఖాస్తు<<>>కు ఇవాళే చివరి తేదీ. ఆగస్టు 19 వరకు ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టెన్త్/సమానమైన విద్యార్హత ఉన్న 18-27 ఏళ్లలోపు వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700-69,100 జీతంతో పాటు అలవెన్సులు ఉంటాయి. టైర్-1,2,3 పరీక్షలతో పాటు మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.

News August 17, 2025

నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

APలో నేటి నుంచి 3 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇవాళ అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. TGలోని కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని IMD తెలిపింది.