News August 16, 2025

పెద్ద కొడప్గల్: వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సబ్ కలెక్టర్

image

పెద్ద కొడప్గల్‌లోని శిథిలావస్థకు చేరిన ఇండ్లను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండకూడదని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News August 17, 2025

NFBS అమలులో జనగామ రెండో స్థానం: కలెక్టర్

image

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) అమలులో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కుటుంబ పెద్ద మరణించినా, పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుందని, ఇప్పటి వరకు 880 మంది లబ్ధిదారులకు రూ.1.76 కోట్లు జమయ్యాయని తెలిపారు. కాగా ఈ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన అవసరమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని కోరారు.

News August 17, 2025

రాజధానిలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం.. వరదకు అడ్డుకట్ట!

image

భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం జలమయం కావడం ప్రధాన సమస్యగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం నీరుకొండ (0.4 టీఎంసీ), కృష్ణాయపాలెం (0.1 టీఎంసీ), శాఖమూరు (0.01 టీఎంసీ)లతో మూడు రిజర్వాయర్లను రూ. 1200-1500 కోట్లతో నిర్మిస్తున్నారు. 8 కి.మీ. గ్రావిటీ కెనాల్‌తో పాటు 48.3 కి.మీ. కాలువల వెడల్పు, పూడికతీత పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే అమరావతిలో నీరు నిలబడదని అధికారులు చెబుతున్నారు.

News August 17, 2025

జనగామ: ప్రకృతి గీసిన చిత్రం, క్యాప్చర్ చేసిన గౌడన్న

image

భూమిపై రైతుల కష్టంతో ఏర్పడిన పచ్చని పొలాలు, వాటిపై తాటి చెట్టు నీడ, ఇది ప్రకృతి గీసిన అందమైన చిత్రం. ఈ చిత్రం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండలో కనిపించింది. ఎర్రని సూర్యుడుని అడ్డుకున్న తాటి చెట్టు నీడ, పచ్చని పొలాలపై పడి ఆకర్షించింది. కాగా, ఆ చెట్టుపై ఉన్న గౌడన్న శివకుమార్ చిత్రీకరించిన ఈ ఫొటోను Way2News సేకరించింది.