News August 16, 2025

పీలేరు: మూడో ఫ్లోర్ నుంచిపడి రిటైర్డ్ SI మృతి

image

అన్నమయ్య జిల్లాలోని పీలేరులో విషాద ఘటన చోటుచేసుకుంది. పీలేరులోని బీసీ కాలనీలో ఉండే రిటైర్డ్ SI వెంకటరమణ శనివారం తన ఇంటి మూడో ఫ్లోర్ పైన సాయంత్రం పూలు కోస్తున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇతనికి భార్యా పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News August 17, 2025

నరసరావుపేటలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

నరసరావుపేట పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం లైవ్ కోడి కేజీ గత వారంతో పోలిస్తే రూ. 8 తగ్గి రూ.121గా విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ. 240 నుంచి రూ. 260, విత్ స్కిన్‌ రూ. 220 నుంచి రూ. 240 మాంసప్రియలకు అందుబాటులో ఉంది. మటన్ ధర కేజీ రూ. 900 వద్ద కొనసాగుతుంది. 100 కోడిగుడ్లు రూ. 520 విక్రయిస్తున్నారు. లైవ్ కోడి ధర తగ్గినప్పటికీ గతవారం ధరలనే చికెన్ స్టాల్స్ వ్యాపారులు కొనసాగిస్తున్నారు.

News August 17, 2025

NZB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంత మందికి వచ్చిందో తెలుసా?

image

నిజామాబాద్ జిల్లాలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఊతమిచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కళ్యాణ లక్ష్మి కింద 1,080 మంది లబ్ధిదారులకు రూ.10.81 కోట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా, షాదీ ముబారక్ ద్వారా 672 మంది లబ్ధిదారులకు రూ.6.72 కోట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం రూ.17.53 కోట్లు పంపిణీ అయినట్లు పేర్కొన్నారు.

News August 17, 2025

కృష్ణ: Way2News ఎఫెక్ట్.. స్పందించిన మంత్రి

image

కృష్ణ మండలం గుడెబల్లూర్‌లో శ్మశానానికి వెళ్లే దారిలేక గ్రామస్థులు మృతదేహాలను మోకాలి లోతు నీటిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 4న Way2Newsలో ‘మంత్రి ఇలాకాలో <<17296536>>శ్మశానానికి<<>> దారేది?’ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై తక్షణమే శ్మశానానికి రోడ్డు వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్లొకెయిన్‌తో పనులు మొదలుపెట్టారు. దీంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.