News August 16, 2025

PDPL: చిల్లపల్లి జీపీకి జాతీయ గుర్తింపు

image

మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో 2024 నేషనల్ పంచాయతీ అవార్డు అందుకున్న మంథని(M) చిల్లపల్లి(GP)కి మరో గౌరవం దక్కింది. కార్యదర్శి R.రామ్ కిశోర్‌కు స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఎర్రకోటకు కేంద్రప్రభుత్వం ఆహ్వానం పంపింది. నిన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కిశోర్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. జెండా ఆవిష్కరణ ప్రత్యక్ష వీక్షణ గర్వకారణమని, గ్రామ అభివృద్ధికి కృషి కొనసాగిస్తానని ఆయన అన్నారు.

Similar News

News August 17, 2025

అన్నమయ్య: కొత్త జిల్లాలు.. మీరేమంటారు?

image

బి.కొత్తకోటకు వచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ‘పుంగనూరు నియోజకవర్గాన్ని మదనపల్లె డివిజన్‌లో కలపడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రజల సౌకర్యార్థం మండలాలు, జిల్లాలను విభజిస్తున్నాం. అందరికీ సానుకూలమైన నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన ప్రకటించారు. మరోవైపు మదనపల్లె జిల్లా కావాలని కొందరు, రాజంపేట కేంద్రంగా బద్వేల్ కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

News August 17, 2025

ట్రంప్, పుతిన్ భేటీ.. గెలిచిందెవరు?

image

US, రష్యా ప్రెసిడెంట్స్ ట్రంప్, పుతిన్ భేటీ కావడం జియోపాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చర్చలు విఫలమైనప్పటికీ పుతిన్‌దే విజయమంటూ US మాజీ అధికారులు సైతం చెబుతున్నారు. ట్రంప్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని అంటున్నారు. కనీసం సీజ్‌ఫైర్ ప్రస్తావన కూడా తీసుకురాలేదన్నారు. మరోవైపు శత్రుదేశం రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం, ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని సమర్థించుకోవడం పుతిన్ సాధించిన విజయంగా అభివర్ణిస్తున్నారు.

News August 17, 2025

సంగారెడ్డి: అడ్మిషన్లకు రేపే చివరి తేదీ

image

ఓపెన్ విధానంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు ఈనెల18 చివరి తేదీ అని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకట స్వామి ఆదివారం తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అధ్యయన కేంద్రాల్లో అర్హులైన వారు అడ్మిషన్ పొందాలని చెప్పారు. మీ-సేవ కేంద్రాల్లో మాత్రమే ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.