News August 16, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

⍟జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
⍟ జిల్లాలో పలు చోట్ల సర్ధార్ గౌతు లచ్చన్న జయంతి
⍟ టీడీపీ ఎమ్మెల్యే కూన రవి తీరుపై వైసీపీ మండిపాటు
⍟ ఎల్.ఎన్ పేట: భారీ గుంతతో ప్రమాదం తప్పదా ?
⍟ టెక్కలి: షాపు తెరవకపోయినా.. రూ.7వేలు విద్యుత్ బిల్లు
⍟కిడ్నీ వ్యాధిగ్రస్థుల మృత్యుఘోష పట్టదా: సీపీఎం
⍟ కాశీబుగ్గలో 20 కేజీల గంజాయి స్వాధీనం
⍟ శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు

Similar News

News August 17, 2025

ఎంపీ కేశినేనిని కలిసిన ఎమ్మెల్యే శిరీష

image

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో ఎంపీ కేశినేని శివనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ (ఏసీఏ) అధ్య‌క్షుడిగా ఎన్నికైన సంద‌ర్భంగా ఎంపీకి పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్యే గౌతు శిరీషను ఎంపీ శాలువాతో సత్కరించి, కొండ‌ప‌ల్లి బొమ్మ‌ను బహుకరించారు.

News August 17, 2025

టెక్కలి: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. తప్పిన ప్రమాదం

image

టెక్కలి – మెలియాపుట్టి రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం వేకువజామున డీజిల్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న AP39 UU 7060 నంబరు లారీ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 1033 హైవే అంబులెన్స్
ద్వారా అతన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 17, 2025

శ్రీకాకుళంలో చికెన్ ధరలు ఇలా..!

image

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చికెన్, మటన్, చేపల ధరలు పెరిగాయి. బాయిలర్ స్కిన్ చికెన్ కిలో రూ. 210, స్కిన్‌లెస్ రూ.220, నాటుకోడి రూ.800కి విక్రయించారు. గత వారంతో పోలిస్తే ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మటన్ కిలో రూ. 900, చేపలలో బొచ్చలు రూ.250, కోరమీను రూ.450కి అమ్మకాలు జరుగుతున్నాయి. సాధారణ వినియోగదారులు ఖర్చులు భారమవుతున్నాయని అంటున్నారు.