News August 16, 2025
పెగడపల్లి: సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా భూమేశ్వర్

జగిత్యాల జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శిగా పెగడపల్లి మండలం కీచులాటపల్లికి చెందిన ఇరుగురాల భూమేశ్వర్ నియమితులయ్యారు. శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో భూమేశ్వర్‌ను పార్టీ నాయకులు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భూమేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొంటూ, తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News August 17, 2025
నిజామాబాద్: రూ. 57.98 కోట్ల పెన్షన్ల పంపిణీ

నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో జిల్లాలో పెన్షన్ల రూపేణ ప్రతినెల 2,69,174 మందికి 57 కోట్ల 98 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో జిల్లాలోని 2,50,610 మంది వివిధ రకాల ఆసరా పింఛనుదారులకు నెలవారి పింఛను రూ.2,016 చెల్లిస్తున్నారు. అలాగే 18,564 మంది వికలాంగులకు నెలవారి పింఛన్ రూ. 4,016 ఇస్తున్నారు.
News August 17, 2025
విశాఖలో ఒ’క్కో’ చోట ఒ’క్కో’లా నాన్ వెజ్ ధరలు

విశాఖలో నాన్ వెజ్ ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి. అక్కయ్యపాలెంలో కేజీ మటన్ రూ.900-1000 మధ్య ఉండగా.. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.240, స్కిన్ రూ.230గా ఉంది. తాటిచెట్లపాలెంలో కేజీ మటన్ కొన్ని షాపుల్లో రూ.900 ఉండగా.. మరికొన్ని షాపుల్లో రూ.800గా ఉంది. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.230, స్కిన్ రూ.220గా ఉంది. డజన్ గుడ్లు ధర రూ.66గా ఉంది.
News August 17, 2025
NZB: మహాలక్ష్మీ పథకం కింద ఎన్ని కోట్లు ఆదా ఆంటే?

నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ మహాలక్ష్మి పథకం మహిళా ప్రయాణీకులకు భారీ ఊరటనిచ్చింది. అధికారిక నివేదికల ప్రకారం, పథకం ప్రారంభం నుంచి ఆగస్టు 10 వరకు 6 కోట్ల 8 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. దీనివల్ల వారికి రూ. 249.13 కోట్లు ఆదాయం ఆదా అయినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జిల్లాలో సగటున ప్రతిరోజూ లక్ష మంది మహిళలు ఈ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు.