News August 17, 2025

ఫ్రీ బస్ స్కీమ్.. ఆధార్ జిరాక్స్, సాఫ్ట్ కాపీలకు అనుమతి?

image

AP: ‘స్త్రీ శక్తి’ స్కీమ్ అమలులో భాగంగా RTC బస్సుల్లో ఆధార్ జిరాక్స్, సెల్‌ఫోన్‌లో సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పథకం అమలు తీరుపై CM చంద్రబాబు సమీక్షించారు. ఘాట్ రోడ్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. గడచిన 30 గంటల్లో 12 లక్షల మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఎల్లుండి నుంచి రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Similar News

News August 17, 2025

చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

image

APలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గతవారంతో పోలిస్తే పెరిగాయి. గతవారం కిలో రూ.220-రూ.230 వరకు అమ్మకాలు జరిగాయి. ఇవాళ పల్నాడులో కిలో రూ.260 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.240-రూ.250, గుంటూరు, చిత్తూరులో రూ.200 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. అటు హైదరాబాద్‌లో రూ.190- రూ.210, వరంగల్‌లో రూ.200, ఖమ్మంలో రూ.210 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?

News August 17, 2025

ట్రంప్, పుతిన్ భేటీ.. గెలిచిందెవరు?

image

US, రష్యా ప్రెసిడెంట్స్ ట్రంప్, పుతిన్ భేటీ కావడం జియోపాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చర్చలు విఫలమైనప్పటికీ పుతిన్‌దే విజయమంటూ US మాజీ అధికారులు సైతం చెబుతున్నారు. ట్రంప్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని అంటున్నారు. కనీసం సీజ్‌ఫైర్ ప్రస్తావన కూడా తీసుకురాలేదన్నారు. మరోవైపు శత్రుదేశం రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం, ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని సమర్థించుకోవడం పుతిన్ సాధించిన విజయంగా అభివర్ణిస్తున్నారు.

News August 17, 2025

నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక భేటీ

image

బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ ఉదయం 9.30 గంటలకు కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడింది. అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతలను ఎన్డీఏ వర్గాలు ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి. నామినేషన్ దాఖలుకు సమయం సమీపిస్తుండటంతో ఇవాళ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు.