News August 17, 2025

తిరుమలలో క్యూలైన్లను పరిశీలించిన ఎస్పీ

image

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు క్యూలైన్ల వద్దకు చేరుకుని క్యూలైన్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 17, 2025

అలాంటి సినిమాలను ఆపేయాలి: లోకేశ్

image

AP: సినిమాల్లో మహిళలపై వివక్షను కట్టడి చేసేందుకు సమయం ఆసన్నమైందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘మహిళలకు మనమిచ్చే గౌరవమే నిజమైన నాగరిక సమాజానికి పునాది. వారి పట్ల లింగ వివక్ష, అవమానకరమైన సంభాషణలను కట్టడి చేయాలి. అలాంటి డైలాగ్స్ ఉన్న మూవీ లేదా సీరియల్‌ను ఆపేయాలి. ఇంట్లో, స్క్రీన్‌పై చూసే అంశాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News August 17, 2025

MHBD: భారీ వర్షాలు.. ఉన్నత స్థాయి సమీక్ష!

image

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో MHBD జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి సీతక్క నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల జిల్లాలోని లో లెవల్ వంతెనలపై వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయన్నారు. దీంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలు రాం చంద్రు నాయక్, మురళీ నాయక్, ఇంచార్జ్ కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.

News August 17, 2025

శ్రీశైలం డ్యామ్‌కు తగ్గిన వరద.. 2 గేట్లు మూసివేత

image

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. దీంతో డ్యామ్ 5 గేట్లలో శనివారం ఒక్క గేటు, ఆదివారం మరొక గేటు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం మూడు గేట్లద్వారా 79,269 క్యూసెక్కుల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65,807 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి డ్యాం నీటిమట్టం 881.40 అడుగులు నీటి నిల్వ సామర్థ్యం 195.6605 టీఎంసీలుగా నమోదైంది.