News August 17, 2025

VZM: కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి

image

PGRS అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం సూచించారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఆ నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను కూడా సంప్రదించవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News August 17, 2025

కొత్తవలసలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రం నాటికి కొత్తవలసలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ASO రామకృష్ణ రాజు తెలిపారు. బొండపల్లి 10.6mm, గంట్యాడ 17.6mm, ఎస్ కోట 32.6mm, వేపాడ 80.6mm, ఎల్.కోట 49.6mm, కొత్తవలస 124mm, జామి 14mm, విజయనగరం 35mm, నెల్లిమర్ల 8.4mm, పూసపాటిరేగ 26.8mm, డెంకాడ 18.2mm, భోగాపురం 41.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.

News August 17, 2025

సంతకవిటి: నాగావళి నదిలో వృద్ధుడు గల్లంతు

image

బహిర్భూమికి వెళ్లి నాగవళి నదిలో ప్రమాదవశాత్తూ జారిపడి వృద్ధుడు గల్లంతైన ఘటన ఆదివారం సంతకవిటి మండలంలో జరిగింది. మండలంలోని పొడలి గ్రామానికి చెందిన ఉరదండ పోలయ్య (76) ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది తీరానికి వెళ్లాడు. ఎప్పటికీ రాకపోవడంతో వృద్ధుడి కోసం కుటుంబీకులు వెతికానా దొరకలేదు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు.

News August 17, 2025

విజయనగరం స్పా సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు

image

విజయనగరం పట్టణంలోని పలు స్పా సెంటర్లో శనివారం రాత్రి విజయనగరం వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కె చౌదరి ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు బయటపడలేదని, స్పా సెంటర్ల నిర్వహణకు తగిన సూచనలు ఇచ్చామన్నారు. స్పా సెంటర్లు కార్యకలాపాలను పూర్తిగా పారదర్శకంగా చట్టబద్ధంగా కొనసాగించాలని సూచించారు. సెంటర్లకు సంబంధించి రికార్డులు, సీసీ ఫుటేజీలను పరిశీలించామన్నారు.