News April 1, 2024
ఓయూ నూతన వీసీ ఎంపికపై కసరత్తు
ఓయూకు వచ్చే నెలలో కొత్త వీసీ రానున్నారు. వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న 93 మంది ప్రొఫెసర్లలో అత్యధికంగా రిటైర్ అయిన అధ్యాపకులు, కొందరు ప్రొఫెసర్లు ఓయూతో పాటు ఇతర వర్సిటీలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతోపాటు గతంలో వీసీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ల వివరాలపై ఇంటిలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.
Similar News
News January 17, 2025
HYD: చేవెళ్లలో త్వరలో ఉపఎన్నిక: కేటీఆర్
చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చేవెళ్లకు త్వరలో ఉప ఎన్నిక రాబోతోందని KTR వ్యాఖ్యలపై మీరేమంటారు. కామెంట్ చేయండి.
News January 17, 2025
ఇబ్రహీంపట్నం: కూతురు వరసయ్యే బాలికపై అత్యాచారం
కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల కథనం.. తుర్కయంజాల్‌కు చెందిన ఆంజనేయులుకు వరుసకు కూతురయ్యే బాలిక పుట్టినరోజు సందర్భంగా కొత్త బట్టలు కొనిస్తానని ఇంట్లో చెప్పి తుర్కయంజాల్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక కేకలు వేస్తూ బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.
News January 17, 2025
రంగారెడ్డి జిల్లా వెదర్ అప్డేట్ @ AM
రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. చందనవెల్లిలో 13.5℃, రెడ్డిపల్లె 14.2, కాసులాబాద్, తాళ్లపల్లి 14.3, షాబాద్, చుక్కాపూర్, ఎలిమినేడు 14.6, మీర్‌ఖాన్‌పేట 14.7, కడ్తాల్, రాచూలూరు 15, HCU, ఆరుట్ల 15.1, కేతిరెడ్డిపల్లి, ఇబ్రహీంపట్నం 15.2, యాచారం, శంషాబాద్, రాజేంద్రనగర్, గునగల్ 15.3, దండుమైలారం 15.5, తొమ్మిదిరేకుల, సంగం 15.6, అమీర్‌పేట 15.6, కందువాడలో 15.7℃గా నమోదైంది.