News August 17, 2025

ఈనెల 19న రాజంపేటకు YS జగన్

image

YS జగన్మోహన్ రెడ్డి ఈనెల 19న రాజంపేట మండలం ఆకేపాడు గ్రామానికి రానున్నారని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి తెలిపారు. YS జగన్ హెలికాప్టర్‌లో దిగడానికి ఆకేపాడు గ్రామం వద్ద జరుగుతున్న పనులను MLA శనివారం పరిశీలించారు. ఆకేపాటి తమ్ముడి కుమారుడి రిసెప్షన్‌లో పాల్గొనడానికి జగన్ రానున్నారని MLA తెలిపారు.

Similar News

News August 17, 2025

గద్వాల్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కర్ణాటక రాష్ట్రం సైదాపూర్ వద్ద నిన్న ఘోర రోడ్డు చోటుచేసుకుంది. గట్టు మండలం మాచర్లకు చెందిన పీజీ రాఘవేంద్ర(42), ఆయన బంధువు నాగేశ్(50) మృతి చెందారు. రాఘవేంద్ర గద్వాల్ చీరలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. వ్యాపారం అనంతరం పుణే నుంచి అక్కబావలతో కలిసి కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. సైదపూర్ వద్ద కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో మసుమన్న, ఈరమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 17, 2025

NLG: జిల్లాలో 65 శాతానికి పైగానే వర్షపు నీరు వృధా..!

image

NLG జిల్లాలో నూతన గృహ నిర్మాణాలు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా పట్టణంతో పాటు శివారులోని గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణాలు జోరందుకోవడంతో భూగర్భజలాల వినియోగం బాగా పెరుగుతోంది. ఏటా కురుస్తున్న వర్షపు నీటిని నేల గర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీచార్జింగ్ పిట్స్ లేకపోవడంతో సుమారు 65 నుంచి 70 శాతం మేర వృథాగా పోతున్నట్లు భూగర్భజల నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News August 17, 2025

NLG: ఇక సౌర వెలుగులు.. సోలార్ ఏర్పాట్లు

image

ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవాలని భావిస్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ క్రమంలో దృష్టి సారించిన యంత్రాంగం ఆయా ప్రభుత్వ భవనాలు, వాటికి వినియోగిస్తున్న విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్నారు.