News August 17, 2025
శుభ సమయం (17-08-2025) ఆదివారం

✒ తిథి: బహుళ నవమి రా.8.31 వరకు
✒ నక్షత్రం: కృత్తిక ఉ.6.45 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేవు
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13
✒ వర్జ్యం: రా.9.39-11.09 వరకు
✒ అమృత ఘడియలు: తె.2.07-3.36 వరకు
Similar News
News August 17, 2025
చామ దుంపలతో సంపూర్ణ ఆరోగ్యం!

చామ దుంపలు తినేందుకు ఆసక్తి చూపేవారు తక్కువగా ఉంటారు. అయితే, వీటితో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ‘ఈ దుంపలతో ఎముకలు బలంగా తయారవుతాయి. కంటిచూపు మెరుగవుతుంది. జీర్ణ వ్యవస్థను సరిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే శక్తి వీటిల్లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. వాటిల్లోని పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచిది’ అని అంటున్నారు. SHARE IT.
News August 17, 2025
PAC భేటీ తర్వాత ఎన్నికలపై క్లారిటీ: మహేశ్ గౌడ్

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. SEP 30లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే, కోర్టును మరింత సమయం కోరాలనే ఆలోచనలో CM రేవంత్ ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) భేటీలో ఎన్నికలపై క్లారిటీ వస్తుందని చెప్పారు. పార్టీపరంగా రిజర్వేషన్ల కల్పన, ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశాలను పరిశీలిస్తున్నామన్నారు.
News August 17, 2025
చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

APలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గతవారంతో పోలిస్తే పెరిగాయి. గతవారం కిలో రూ.220-రూ.230 వరకు అమ్మకాలు జరిగాయి. ఇవాళ పల్నాడులో కిలో రూ.260 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.240-రూ.250, గుంటూరు, చిత్తూరులో రూ.200 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. అటు హైదరాబాద్‌లో రూ.190- రూ.210, వరంగల్‌లో రూ.200, ఖమ్మంలో రూ.210 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?