News August 17, 2025
KMR: జాతీయ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ బాలు

కామారెడ్డికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం దేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వ్యక్తిగతంగా 77 సార్లు రక్తదానం చేసినందుకు ఐవీఎఫ్ జాతీయ పురస్కారాన్ని ఈ నెల 19న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చేతుల మీదుగా న్యూఢిల్లీలో అందుకోనున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News August 17, 2025
MNCL: జిల్లాలో 54.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో 54.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కన్నెపల్లి మండలంలో 135.8 సెంటీమీటర్లు.. అత్యల్పంగా చెన్నూర్ లో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భీమినిలో 122.6, నెన్నెలలో 89.6, హాజీపూర్ లో 79.8, మంచిర్యాలలో 76.4, జైపూర్ లో 72.6, నస్పూర్ లో 62, తాండూరులో 68.2, కోటపల్లిలో 24.6, బెల్లంపల్లిలో 37.4, లక్షెట్టిపేటలో 35 సెంటీమీటర్ల వర్షం పడింది.
News August 17, 2025
సిరిసిల్ల: వర్షాలు.. ‘ప్రజావాణి కార్యక్రమం రద్దు’

వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రేపు జరగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ తమ వినతులు తీసుకొని కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారన్నారు.
News August 17, 2025
సంగారెడ్డి: వేడి చేసిన నీటినే తాగండి: ఈఈ

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూచించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా సరఫరా అవుతున్న నీరు శుద్ధి చేసి క్లోరినేషన్ అయినప్పటికీ, వర్షాల కారణంగా ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు.