News August 17, 2025
మద్యం తాగి వాహన నడిపి చిక్కుల్లో పడొద్దు: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 324 కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 మంది వాహనదారులకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మిగతా 308 కేసుల్లో రూ.3.95 లక్షల జరిమానాను వాహనదారులు కోర్టులో చెల్లించినట్లు సీపీ తెలిపారు.
Similar News
News August 17, 2025
MBNR: గణేష్ మండపాలు.. అప్లై చేసుకోండి- SP

తెలంగాణ రాష్ట్ర పోలీసు వెబ్‌సైట్‌లో గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులకు అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. భద్రత, బందోబస్తు దృష్ట్యా https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు శాఖ ఆన్‌లైన్ ద్వారానే అనుమతులను మంజూరు చేస్తుందని, అనంతరం వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. #SHARE IT
News August 17, 2025
ఆసియా కప్‌కు పాక్ జట్టు ప్రకటన.. సీనియర్ ప్లేయర్లకు షాక్

SEP 9 నుంచి జరిగే ఆసియా కప్(T20)కు పాక్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లకు చోటు దక్కలేదు. సల్మాన్ అలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: సల్మాన్ అలీ అఘా (C), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, H నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, M హరీస్(WK), M నవాజ్, వసీమ్ Jr, సహిబ్జాదా ఫర్హాన్, S అయూబ్, S మీర్జా, షాహీన్ ఆఫ్రిది, సుఫియాన్ మొకిమ్.
News August 17, 2025
గంగారాం: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ఏడు బావుల జలపాతంలో ప్రేమ్ కుమార్(23) శనివారం<<17432714>> గల్లంతైన విషయం తెలిసిందే<<>>. గంగారం మండలం పందెం శివారులోని కీకారణ్యం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల అనంతరం ఆదివారం అతడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిది భద్రాద్రి జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం.