News August 17, 2025

సైనికులను తయారు చేసే గ్రామం ధనసిరి

image

సంగారెడ్డి జిల్లాలోని ధనసిరి గ్రామం దేశానికి సైనికులను అందించడంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఈ గ్రామం నుంచి సుమారు 50 మందికి పైగా యువకులు భారత సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించారు. ధనసిరిలో దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక యువకుడు సైన్యంలో ఉండడం ఈ గ్రామానికి గర్వకారణంగా మారింది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ సేవలో ఈ గ్రామానికి చెందిన జవాన్లు నిమగ్నమై ఉన్నారు.

Similar News

News August 17, 2025

ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నేపథ్యం ఇదే

image

C.P. రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి <<17436465>>రాధాకృష్ణన్<<>>. ఈయన 1957లో తమిళనాడులో జన్మించారు. 16 ఏళ్ల వయసు నుంచే RSS, జన్ సంఘ్‌లో పని చేశారు. 1998, 99లో కోయంబత్తూరు BJP ఎంపీగా గెలిచారు. 2004, 14, 19లో ఓడిపోయారు. 2004-07 వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పని చేశారు. 2023లో ఝార్ఖండ్ గవర్నర్‌గా ఎంపికయ్యారు. 2024లో TG గవర్నర్ గానూ అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులైలో MH గవర్నర్‌గా నియమితులయ్యారు.

News August 17, 2025

రేపు విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవు: డీఈవో

image

విశాఖలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలకు సెలవిచ్చినట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విషయాన్ని గమనించాలని సూచించారు.

News August 17, 2025

గుంటూరు జిల్లాలో రేపు వర్షం కురిసే ఛాన్స్

image

గుంటూరు జిల్లాలో సోమవారం పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇప్పటికే APSDMA చరవాణిలకు మెసేజ్‌లు పంపింది.