News August 17, 2025
EP38: ఇలా చేస్తే కెరీర్‌లో విజయం తథ్యం: చాణక్య నీతి

బలమైన ప్రణాళిక, స్పష్టమైన లక్ష్యం లేకుండా జీవితంలో సక్సెస్ కావడం కష్టమని చాణక్య నీతి చెబుతోంది. ‘కలలు కనడం కాదు, ఆ కలలను వాస్తవంగా మార్చేందుకు కృషి చేయాలి. విజయం సాధించాలంటే సరైన గైడెన్స్, సలహాలు అవసరమే. వైఫల్యాలకు భయపడకూడదు. ఓపిక, నమ్మకం చాలా అవసరం. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఎవరూ తమ విజయం కోసం అదృష్టంపై ఆధారపడకూడదు’ అని చాణక్య నీతి బోధిస్తోంది. <<-se>>#Chankyaneeti<<>>
Similar News
News August 17, 2025
రాధాకృష్ణన్‌కు ఎంతో అనుభవం ఉంది: మోదీ

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన <<17436566>>C.P. రాధాకృష్ణన్‌కు<<>> ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘ఎంపీగా, గవర్నర్‌గా రాధాకృష్ణన్‌కు ఎంతో అనుభవం ఉంది. ప్రజాజీవితంలో అంకితభావంతో పని చేశారు. ఆయనకు రాజ్యాంగంపై మంచి పట్టు ఉంది. NDA కూటమి ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు సైతం రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపారు.
News August 17, 2025
అఫిడవిట్ అడిగిన CEC.. స్పందించిన రాహుల్

CEC <<17435119>>వ్యాఖ్యలపై<<>> రాహుల్ గాంధీ స్పందించారు. ‘ఈసీ నన్ను అఫిడవిట్ అడిగింది. నా లాంటి ఆరోపణలే చేసిన అనురాగ్ ఠాకూర్ (బీజేపీ నేత)ను ఎందుకు అడగలేదు. MH అసెంబ్లీ ఎన్నికలను NDA క్లీన్‌స్వీప్ చేసింది. ఆ ఫలితాలపై రీసెర్చ్ చేశాం. 4 నెలల్లో ఈసీ కోటి ఓట్లు చేర్చినట్లు గుర్తించాం. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్లలో తేడా లేదు. కొత్తగా వచ్చిన కోటి ఓట్ల వల్లే ఎన్డీయే గెలిచింది’ అని వ్యాఖ్యానించారు.
News August 17, 2025
భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: అల్పపీడన ప్రభావంతో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పశ్చిమగోదావరి, కాకినాడకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఈ జిల్లాలోనూ సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.