News August 17, 2025
యూత్ మెచ్చిన సిటీగా బ్యాంకాక్

ప్రపంచంలోని 30 ఏళ్లలోపు యువత (Gen Z) మెచ్చిన నగరంగా బ్యాంకాక్ నిలిచింది. ధరలు, కల్చర్, నైట్ లైఫ్, క్వాలిటీ లైఫ్ ఈ నాలుగు లక్షణాలు ఆ సిటీలో ఉండటంతో వారు బ్యాంకాక్ వైపు మొగ్గుచూపుతున్నట్లు టైమ్ అవుట్ సర్వేలో తేలింది. ఇందులో రెండో నగరంగా మెల్‌బోర్న్, మూడో స్థానంలో కేప్ టౌన్ నిలిచాయి. న్యూయార్క్, కోపెన్ హాగన్, బార్సిలోనా, ఎడిన్ బర్గ్, మెక్సికో సిటీ, లండన్, షాంఘై నగరాలు టాప్-10లో నిలిచాయి.
Similar News
News August 17, 2025
23న టీపీసీసీ పీఏసీ సమావేశం.. పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ!

TPCC రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) ఈ నెల 23న సా.5 గంటలకు సమావేశం కానుంది. BC రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. PAC మీటింగ్ గురించి చర్చించేందుకు ఇవాళ ఉదయం CM రేవంత్‌తో TPCC చీఫ్ మహేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, వి.హనుమంతరావు ఈ భేటీలో పాల్గొన్నారు.
News August 17, 2025
BCCI కొత్త రూల్.. ICC అనుసరించాలా?

BCCI కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఏ ప్లేయరైనా గాయపడి, ఆడలేని స్థితిలో ఉంటే వారి స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకోవచ్చు. ఈ రూల్ మల్టీ డే(వన్డే, టీ20లు కాకుండా) ఫార్మాట్ మ్యాచ్‌లకే వర్తిస్తుంది. ఇటీవల ENGతో టెస్ట్ సిరీస్‌లో పంత్, వోక్స్ తీవ్ర గాయంతో ఆడటానికి ఇబ్బందిపడిన నేపథ్యంలో ICC కూడా దీన్ని అమలు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు?
News August 17, 2025
గీత కార్మికులకు త్వరలో ద్విచక్ర వాహనాలు: మంత్రి

AP: గీత కార్మికుల కోసం త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఈ స్కీమ్ కింద వారికి ద్విచక్ర వాహనాలు (మోపెడ్) అందజేస్తామన్నారు. గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కడానికి అధునాతన పరికరాలు ఇస్తామని చెప్పారు. రంపచోడవరం హార్టికల్చర్ పరిశోధనా కేంద్రంలో నూతన తాటి ఉత్పత్తులు తయారు చేసి, గీత కార్మికులకు ఉపాధి, ఆర్థిక వృద్ధి మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని CM ఆదేశించినట్లు పేర్కొన్నారు.