News August 17, 2025
రాజధానిలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం.. వరదకు అడ్డుకట్ట!

భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం జలమయం కావడం ప్రధాన సమస్యగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం నీరుకొండ (0.4 టీఎంసీ), కృష్ణాయపాలెం (0.1 టీఎంసీ), శాఖమూరు (0.01 టీఎంసీ)లతో మూడు రిజర్వాయర్లను రూ. 1200-1500 కోట్లతో నిర్మిస్తున్నారు. 8 కి.మీ. గ్రావిటీ కెనాల్‌తో పాటు 48.3 కి.మీ. కాలువల వెడల్పు, పూడికతీత పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే అమరావతిలో నీరు నిలబడదని అధికారులు చెబుతున్నారు.
Similar News
News August 17, 2025
చామ దుంపలతో సంపూర్ణ ఆరోగ్యం!

చామ దుంపలు తినేందుకు ఆసక్తి చూపేవారు తక్కువగా ఉంటారు. అయితే, వీటితో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ‘ఈ దుంపలతో ఎముకలు బలంగా తయారవుతాయి. కంటిచూపు మెరుగవుతుంది. జీర్ణ వ్యవస్థను సరిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే శక్తి వీటిల్లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. వాటిల్లోని పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచిది’ అని అంటున్నారు. SHARE IT.
News August 17, 2025
NLG: పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కట్!

పంచాయతీ కార్యదర్శుల నకిలీ హాజరును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. జిల్లాలో కొందరు కార్యదర్శులు తప్పుడు పద్ధతిలో హాజరు నమోదు చేసిన విషయం తెలిసిందే. 69 మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు వెళ్లకుండానే వెళ్లినట్లుగా ఆ పంచాయతీలో పని చేసే కార్యదర్శుల చేత తప్పుడు ఫోటోలు అప్లోడ్ చేయించారు. వారందరికీ చార్జింగ్ మెమోలు జారీ చేసేందుకు సిద్ధమైంది. వీరందరికీ పదోన్నతులతోపాటు ఇంక్రిమెంట్లు సైతం కట్ చేయనున్నారు.
News August 17, 2025
ప్రొద్దుటూరులో కాలేజీ లెక్చరర్ ఆత్మహత్య

ఈ ఘటన ప్రొద్దుటూరులో జరిగింది. టూ టౌన్ సీఐ సదాశివయ్య వివరాల మేరకు.. స్వరాజ్యనగర్‌కు చెందిన పవిత్ర(25) ఎంటెక్ చదివి ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఓ వ్యక్తిని ప్రేమించగా వాళ్ల పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించారు. వచ్చే ఏడాదిలో వివాహం చేస్తామని చెప్పారు. ఇంతలో ఏమైందో ఏమో శనివారం ఆమె ఇంట్లోనే ఉరేసుకున్నారు. గమనించిన బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు.