News August 17, 2025
పిల్లలను చంపి.. ఉరేసుకున్న తండ్రి

AP: పిల్లలను చంపేసి ఓ తండ్రి ఉరేసుకున్న ఘటన గుంటూరులోని సాయిబాబా కాలనీలో జరిగింది. నరసరావుపేటకు చెందిన యూసుబ్(28), సైదాబీ దంపతులు. భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం గమనించిన యూసుబ్ ఈ నెల 14న గొడవ పడి చేయి చేసుకోగా ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆపై పిల్లలు హుస్సేన్(6), ఆరిఫ్(5)లను తీసుకొని యూసుబ్ తన అక్క ఇంటికి వెళ్లాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి తాను ఉరేసుకున్నాడు.
Similar News
News August 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 18, 2025
శుభ సమయం (18-08-2025) సోమవారం

✒ తిథి: బహుళ దశమి సా.6.14 వరకు
✒ నక్షత్రం: మృగశిర తె.3.43 వరకు
✒ శుభ సమయం: ఉ.6.37-9.13, రా.7.49-8.13 వరకు
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34 వరకు
✒ వర్జ్యం: ఉ.9.20-11.50 వరకు
✒ అమృత ఘడియలు: రా.7.05-8.37 వరకు
News August 18, 2025
నేటి ముఖ్యాంశాలు

* AP: వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి: CBN
* దేశానికి జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి లోకేశ్
* ఎన్టీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలంటూ ప్రచారం.. టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్
* TG: ఏపీలోనూ కాంగ్రెస్ బలపడుతుంది: భట్టి
* కాళేశ్వరం మోటార్లను నాశనం చేసేందుకు కుట్ర: హరీశ్
* ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా C.P.రాధాకృష్ణన్
* ‘ఓటు చోరీ’ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ