News August 17, 2025
కృష్ణ: Way2News ఎఫెక్ట్.. స్పందించిన మంత్రి

కృష్ణ మండలం గుడెబల్లూర్‌లో శ్మశానానికి వెళ్లే దారిలేక గ్రామస్థులు మృతదేహాలను మోకాలి లోతు నీటిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 4న Way2Newsలో ‘మంత్రి ఇలాకాలో <<17296536>>శ్మశానానికి<<>> దారేది?’ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై తక్షణమే శ్మశానానికి రోడ్డు వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్లొకెయిన్‌తో పనులు మొదలుపెట్టారు. దీంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News August 17, 2025
త్వరలోనే మెట్రో పూర్తి: కిషన్ రెడ్డి

TG: వరంగల్‌లో విమానాశ్రయం రాబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్‌పోర్టును ప్రజా విమానాశ్రయంగా మారుస్తామని చెప్పారు. సాంకేతిక కారణాలతో మెట్రో పెండింగ్‌లో ఉందని, త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, వినియోగదారుల ప్రయోజనాల మేరకు నిర్మాణరంగ సంస్థలు పనిచేయాలని సూచించారు.
News August 17, 2025
శ్రీకాకుళం: మరో 24 గంటల్లో భారీ వర్షాలు

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం కోనసాగుతోంది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి మంగళవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ ‘X’ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ ప్రభావంతో విశాఖ, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News August 17, 2025
సంతకవిటి: నాగావళి నదిలో వృద్ధుడు గల్లంతు

బహిర్భూమికి వెళ్లి నాగవళి నదిలో ప్రమాదవశాత్తూ జారిపడి వృద్ధుడు గల్లంతైన ఘటన ఆదివారం సంతకవిటి మండలంలో జరిగింది. మండలంలోని పొడలి గ్రామానికి చెందిన ఉరదండ పోలయ్య (76) ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది తీరానికి వెళ్లాడు. ఎప్పటికీ రాకపోవడంతో వృద్ధుడి కోసం కుటుంబీకులు వెతికానా దొరకలేదు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు.